యాప్నగరం

Punjab Train Accident: రైలు ఢీకొని 61 మంది మృతి

దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన రావణ దహనాన్ని చూసేందుకు రైల్వే ట్రాక్‌పై నిలబడిన జనంపైకి నుంచి దూసుకెళ్లిన రైలు.

Samayam Telugu 20 Oct 2018, 9:29 am
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రావణ దహానాన్ని చూసేందుకు రైలు పట్టాలపై నిలబడినవారిని రైలు ఢీకొనడంతో 61 మంది మృతి చెందారు. దసరా వేడుకలు పురస్కరించుకుని చౌడా బజార్‌లోని మైదానంలో శుక్రవారం రాత్రి రావణ దహన కార్యక్రమం నిర్వహించారు.
Samayam Telugu adf1


ఈ వేడుకను చూసేందుకు వందలాది మంది జోడా ఫటాక్‌‌కి చేరుకున్నారు. చాలామంది రైల్వే పట్టాలపై నిల్చుని రావణ దహనాన్ని చూస్తున్న సమయంలో అతి వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతం క్షణాల్లోనే రక్తసిక్తమైంది. ఎక్కడ చూసిన తెగిన శరీర భాగాలే కనిపించాయి. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

రావణ దహనంలో బాణాసంచాల పేలుళ్ల వల్ల రైలు వస్తున్న సంగతి గుర్తించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్పందించే లోపే రైలు రెప్పపాటు వేగంతో జనం మీద నుంచి దూసుకెళ్లిందన్నారు. పోలీసులు ముందుగా అప్రమత్తమై ట్రాక్ మీద ప్రజలు ట్రాక్ మీదకు రాకుండా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని, రైల్వే అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఈ దారుణం చోటుచేసుకోకపోదునని స్థానికులు తెలిపారు. ఘటన సమయంలో సుమారు 600 నుంచి 700 మంది జనం అక్కడ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాత్రి వేళ కావడంతో చెల్లాచెదురైన మృత దేహాలను గుర్తించడం కష్టతరంగా మారింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ఆర్తనాదాలతో సంఘటన స్థలంలో విషాద వాతావరణం నెలకొంది.

యాక్సిడెంట్‌కు సంబంధించిన సమాచారం కోసం రైల్వే హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. 01832223171, 01832564485 నంబర్ల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని తెలిపింది.
హెల్ప్‌లైన్ నంబర్లు:
మనవాలా స్టేషన్: 0183-2440024, 0183-2402927
ఫిరోజ్‌పూర్: 01632-1072

ప్రమాదం వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.