యాప్నగరం

Amritsar Train Tragedy: ట్రాక్ క్లియర్‌గా ఉందని సిగ్నల్ ఇచ్చారు: రైలు డ్రైవర్

అమృత్‌సర్‌ విషాదానికి దసరా వేడుకల నిర్వాహకులతో‌పాటు రైల్వే అధికారుల నిర్లక్ష్యం కూడా అని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్, ట్రాక్ బాధ్యతల్లో ఉన్న లైన్‌మ్యాన్ వివరణే ఇందుకు నిదర్శనం.

Samayam Telugu 20 Oct 2018, 3:45 pm
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదానికి రైల్వే నిర్లక్ష్యంగా కూడా కారణమని స్పష్టమవుతోంది. ట్రాక్‌ను తనిఖీ చేసి సమాచారం అందించే లైన్‌మ్యాన్ తప్పిదం వల్ల 59 మంది బలయ్యారు. ఈ ప్రమాదానికి కారణమైన డీఎంయూ రైలును నడిపిన డ్రైవర్.. పంజాబ్ పోలీసులకు తెలిపిన వివరాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
Samayam Telugu Untitled1


‘‘రైలు ముందుకు పోనిచ్చేందుకు గ్నీన్ సిగ్నల్ కనిపించింది. ఆ సమయానికి రైల్వే ట్రాక్ మీద వందలాది మంది ఉన్నారనే సంగతి నాకు తెలీదు. అందుకే రైలు ఎప్పటిలాగానే నిర్ణిత వేగంలో నడిపా’’ అని రైలు డ్రైవర్ తెలిపాడు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న లైన్‌మ్యాన్‌ను సైతం పోలీసులు ప్రశ్నించారు. ట్రాక్ మీద జనాలు ఉన్నట్లు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వకుండా, గ్రిన్ సిగ్నల్ ఇచ్చానని వెల్లడించాడు.

ఈ ప్రమాదం జరిగే సమయానికి రైల్వే మంత్రి పియూష్ గోయల్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సమాచారం తెలియగానే ఆయన ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు. రైల్వే సహాయ మంత్రి మనోజన్ సిన్హా శుక్రవారం రాత్రే ప్రమాద స్థలికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. అక్కడ రావణ దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తమకు సమాచారం ఇవ్వలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత వేడుక నిర్వాహకులు పరారయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.