యాప్నగరం

అనిల్ అంబానీకి అంతర్జాతీయ గౌరవం

రిలయన్స్ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ.. ప్రపంచ మేధో సంపత్తి వర్గమైన ‘ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌’లో సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు.

TNN 28 Mar 2017, 7:18 pm
రిలయన్స్ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ.. ప్రపంచ మేధో సంపత్తి వర్గమైన ‘ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌’లో సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. ‘భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీని అంతర్జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా చేరుస్తూ ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌ ప్రకటన చేసింది’ అని రిలయన్స్‌ గ్రూప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై అనిల్ అంబానీ స్పందిస్తూ.. ‘మండలిలో ఇప్పటివరకూ అమెరికా ప్రాధాన్యం కొనసాగేది. కానీ, ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌.. భౌగోళికంగా, రాజకీయంగా ప్రభావవంతమైన దేశంగా గుర్తింపు పొందుతోంది. మండలిలో భారత్‌ గుర్తింపునకు ఇదే నిదర్శనం’ అని అన్నారు.
Samayam Telugu anil ambani gets a seat on atlantic councils advisory board
అనిల్ అంబానీకి అంతర్జాతీయ గౌరవం


‘అట్లాంటిక్‌ కౌన్సిల్‌’ అనేది విదేశీ విధానాల ఇంటెలెక్చువల్ బృందం. ఇది అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ వేదికగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. న్యూస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రుపెర్ట్‌ ముర్దోక్‌, స్పెయిన్‌ మాజీ ప్రధాని జోస్‌ మారియా అజ్నార్‌, ఎయిర్‌బస్‌ సీఈవో థామస్‌ ఎండర్స్‌, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్‌ రుడ్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

అట్లాంటిక్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జాన్‌ ఎం హంట్స్‌మెన్‌ అనిల్‌ అంబానీని స్వాగతించారు. ఆయనకు సభ్యత్వం ఇవ్వడం ద్వారా దక్షిణాసియాలో మండలికి ప్రాతినిధ్యం లభించిందని హంట్స్‌మెన్‌ పేర్కొన్నారు. అనిల్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.