యాప్నగరం

​మంత్రి పదవి పోతుందా? సిద్ధూకు మరో షాక్?!

మంత్రి పదవా.. టీవీ షోలా.. ఏదో ఒకటి తేల్చుకోవాలని సిద్ధూకు అమరీందర్ అల్టిమేటం ఇస్తే

TNN 21 Mar 2017, 11:30 am
భారతీయ జనతా పార్టీని వీడి.. అటు తిరిగి, ఇటు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం ఊరటను ఇచ్చినా, మంత్రి పదవి దక్కిందని ఆయన కొంచెం ఆనందంగానే ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో సిద్ధూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధూ విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు కొన్ని అంశాలపై విమర్శలు చేశాయి. మంత్రి హోదాలో ఉండి కూడా సిద్ధూ టీవీ కామెడీ షోల్లో కొనసాగడం ఏమిటి? అని వైరి పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Samayam Telugu another shock for siddhu
​మంత్రి పదవి పోతుందా? సిద్ధూకు మరో షాక్?!


మరి ప్రతిపక్షాల సంగతలా ఉంటే.. సిద్ధూ షోల్లో పాల్గొనడంపై ముఖ్యమంత్రి కూడా తర్జనభర్జన పడుతున్నాడని సమాచారం. ఇన్నాళ్లూ ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు.. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా టీవీ షోల్లో పాల్గొనవచ్చా? కూడదా? అనేది ధర్మ సందేహంగా మారిందట అమరీందర్ కు. ఈ విషయంలో స్పష్టత లేక ఆయన అటార్నీ జనరల్ ను సంప్రదించాడట. రాజ్యాంగం ఏం చెబుతోందో.. అని అమరీందర్ ఆరా తీస్తున్నారట.

మరి ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడేమో సిద్ధూ టీవీ షోలను వదులుకునేది లేదని స్పష్టం చేశాడు. ఆ విషయంలో వెనక్కు తగ్గనని స్పష్టం చేశాడు. మరి ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాడని.. ఈ విషయంలో న్యాయ సలహా కోరాడని వస్తున్న వార్తలు సిద్ధూ పదవికి ఎర్త్ పెట్టేవిలా ఉన్నాయి.

మంత్రి పదవా.. టీవీ షోలా.. ఏదో ఒకటి తేల్చుకోవాలని సిద్ధూకు అమరీందర్ అల్టిమేటం ఇస్తే మాజీ క్రికెటర్ కు అంతకు మించిన ఇబ్బందికర పరిస్థితి మరోటి ఉండదు. ​ఉపముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతోనే సిద్ధూ ఒకింత నిరాశ చెందాడు.. మరి ఇప్పుడు మంత్రి పదవి కూడా చేజారితే.. పెద్ద షాకే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.