యాప్నగరం

మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా వస్తోంది...!

దేశ రాజకీయ పరిణామాలను ఆ సినిమాలో ప్రస్తావించనున్నారు.

TNN 6 Jun 2017, 2:24 pm
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా ఒక సినిమా రాబోతోంది. మన్మోహన్ ప్రధానిగా ఉండిన సమయంలో దేశ రాజకీయ పరిణామాలను ఆ సినిమాలో ప్రస్తావించనున్నారు. ఆ పొలిటికల్ డ్రామాలో మన్మోహన్ దే కీలక పాత్ర అని సినిమా రూపకర్తలు ప్రకటించారు. ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. సినిమాలో మన్మోహన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించబోతుండటం. ఈ సినిమా వివరాలను ‘ఎకనామిక్ టైమ్స్’ ఒక కథనంలో పేర్కొంది.
Samayam Telugu anupam kher to play manmohan singh in the accidental prime minister
మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా వస్తోంది...!


సంజయ్ బారు రచించిన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ఆధారంగా సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ వద్ద నాలుగు సంవత్సరాల పాటు పనిచేశారు సంజయ్ బారు. అనంతర కాలంలో మన్మోహన్ పై ఆయన విమర్శస్త్రాలను ఎక్కుపెట్టారు. అలాంటి విమర్శనాత్మక పుస్తకమే ‘యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్’. అనుకోకుండా ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ పనితీరును బారు విమర్శించారు.

కొన్నేళ్ల కిందట వచ్చిన ఆ పుస్తకాన్ని సినిమాగా రూపొందించనున్నారు. సినిమాలో సోనియాగాంధీ, రాహుల్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతల పాత్రలన్నీ ఉంటాయని రూపకర్తలు పేర్కొన్నారు. మన్మోహన్ పాత్రను అనుపమ్ ఖేర్ చేస్తారని.. ఇతర పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసుకుంటున్నట్టుగా ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందు ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. మరి భారతీయ సినిమాల్లో పొలిటికల్ థ్రిల్లర్లు, వాస్తవ రాజకీయ ఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ పొలిటికల్ మూవీ ఏ మేరకు ఆకట్టుకోగలుగుతుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.