యాప్నగరం

‘ఖర్గేను కాంగ్రెస్‌కు అధ్యక్షుణ్ని చేయండి’

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేను నియమించాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సభ్యుడు సంజీవ్ మొయిలీ అధిష్టానాన్ని కోరారు.

TNN 27 Sep 2017, 7:25 pm
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేను నియమించాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సభ్యుడు సంజీవ్ మొయిలీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. ‘పార్టీ నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో మీరు ఉంటే కనుక మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించండి. అలాగే రాహుల్ గాంధీని ఉపాధ్యక్షుడిగా కొనసాగనివ్వండి’ అని మొయిలీ లేఖలో పేర్కొన్నారు. పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఇది ఎంతగానో సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu appoint mallikarjun kharge as aicc chief says congress leader sanjeev moily
‘ఖర్గేను కాంగ్రెస్‌కు అధ్యక్షుణ్ని చేయండి’


‘పార్టీలోని వెనుకబడిన తరగతులకు, దళితులకు ఖర్గే ఆదర్శం. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ పుంజుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. వెనకబడిన తరగతుల ఓటర్లను ఆకర్షించడానికే బీజేపీ రామ్‌నాథ్ కోవింద్‌ను భారత రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని కచ్చితంగా ఒక ఆయుధంలా వాడుకుంటారు. ఆ చాలెంజ్‌కు మనం సన్నద్ధంగా ఉండాలి. పార్టీ శ్రేయస్సు కోసం నిర్విరామంగా పనిచేసే కార్యకర్తను నేను. పార్టీ మనుగడ కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’ అని సంజీవ్ పేర్కొన్నారు.

కాగా, మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈయన గత యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగానూ, కార్మిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. కర్ణాటకకు చెందిన ఈ సీనియర్ నేత.. గుల్బర్గా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.