యాప్నగరం

ఇక నుంచి స్వదేశంలో క్లిష్టమైన ఆయుధాల తయారీ!

యుద్ధ ట్యాంకులతోపాటు ఇతర సైనిక ఆయుధాల విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలో తీవ్ర జాప్యం ఎదుర్కొంటున్నామని, స్వదేశీ పరిఙ్ఞానంతో వీటిని మనమే తయారుచేసుకోవాలని రక్షణ శాఖ భావిస్తోంది

TNN 23 Jul 2017, 3:50 pm
యుద్ధ ట్యాంకులతోపాటు ఇతర సైనిక ఆయుధాల విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలో తీవ్ర జాప్యం ఎదుర్కొంటున్నామని, స్వదేశీ పరిఙ్ఞానంతో వీటిని మనమే తయారుచేసుకోవాలని రక్షణ శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న విడి భాగాల దిగుమతి వచ్చే మూడేళ్ల నాటికి 30 శాతానికి తగ్గించాలని బోర్డ్ తీర్మానం చేసిందని ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. క్లిష్టమైన ఆయుధాలు, విడిభాగాలు దిగుమతుల్లో జాప్యం వల్ల సైన్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన బోర్డ్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సైనికులకు అవసరమైన ఆయుధాలు, యుద్ధ ట్యాంకుల సరఫరా మాస్టర్ జనరల్ ఆఫ్ ది ఆర్డినెన్స్ బాధ్యత వహిస్తుంది. ట్యాంకుల విడిభాగాలు, ఇతర ఆయుధాల తయారీపై వ్యూహ రచనకు ఎంజీఓ దేశంలోని ముఖ్యమైన రక్షణ సంస్థలతో విస్తృతమైన చర్చలు ప్రారంభించింది.
Samayam Telugu army decides to go big on indigenisation of critical spares
ఇక నుంచి స్వదేశంలో క్లిష్టమైన ఆయుధాల తయారీ!


ఎంజీఓ, ఓఎఫ్బీలు ఈ విడి భాగాలకు ఏడాదికి రూ.10 వేల కోట్లు కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని ఆయన తెలిపారు. క్లిష్టమైన ఆయుధాలు సరఫరా చేస్తున్న రష్యా ఎక్కువ సమయం తీసుకుంటుందని, ఇది సైనిక వ్యవస్థల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ అధికారి పేర్కొన్నారు. అదే స్వదేశీ పరిఙ్ఞానంతో వీటిని మనమే తయారు చేసుకుంటే సైన్యానికి ఉపయోగపడుతుంది. ఆయుధాల విడి భాగాల కోసం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విభాగాన్ని భాగస్వామ్యం చేయాలని ఆర్మీ భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే 80 ఎంఎస్ఎంఈలతో చర్చలు జరిపామని, మరో రెండు వారల్లోగా విధానపరమైన నిర్ణయం వెలువడుతుందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.