యాప్నగరం

రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన జైట్లీ

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అదనపు బాధ్యతలు స్వీకరించారు.

TNN 14 Mar 2017, 1:46 pm
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేసి... గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఖాళీ అయిన రక్షణ మంత్రి పదవికి వేరొక సీనియర్ నేతను ఎంపిక చేసే పనిలో పడింది కేంద్రం. ఈలోపు రక్షణ మంత్రి బాధ్యతలను ఎవరో ఒకరికి అప్పగించాలని భావించారు మోడీ. ఆ బాధ్యతను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీకి అప్పగించారు. మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లి జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త మంత్రి వచ్చే వరకు జైట్లీ ఆ శాఖ బాధ్యతలు మోయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.
Samayam Telugu arun jaitley gets charge of defence ministry
రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన జైట్లీ


కాగా కేంద్ర రక్షణ మంత్రిగా ఎవరిని నియమించాలో కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. మరొక ముఖ్యమంత్రిని ఆ పదవికి రాజీనామా చేయించి కేంద్ర మంత్రిని చేసే అవకాశం ఉందని సమాచారం. రేసులో మొదటి స్థానంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తోంది. రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజే ఉన్నారు. త్వరలో కేంద్ర బృందం ఉత్తరాది రాష్ట్రాల్లోని బీజేపీకి చెందిన సీఎంలతో భేటీ అవ్వనున్నారు. ఆ తరువాతే కేంద్ర మంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.