యాప్నగరం

ఈసారైనా ఒప్పుకోండి ప్లీజ్ - కాంగ్రెస్ నేతలతో జైట్లీ

ఢిల్లీ: కాంగ్రెస్ నేతలతో శుక్రవారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్‌టీ బిల్లుపై చర్చించారు.

Samayam Telugu 15 Jul 2016, 7:50 pm
ఢిల్లీ: ఈ సారి ఎలాగైనా జీఎస్టీ బిల్లు ను ఆమోదించుకోవాలని ఎన్డీయే సర్కార్ భావిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేతలతో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీఎస్‌టి బిల్లుకు సహకరించాలని కోరారు. ఈ భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలు పాల్గొన్నారు. ​ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమౌతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్‌‌టీ బిల్లు ఆమోదం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్ సభలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మెజార్టీ లేనందున జీఎస్ టీ బిల్లు విషయంలో కాంగ్రెస్ ను ఒప్పించేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ ఆ పార్టీ సీనియర్ నేతలతో సమావేశయ్యారు.
Samayam Telugu arun jaitly meet cong leader discuus on gst bill
ఈసారైనా ఒప్పుకోండి ప్లీజ్ - కాంగ్రెస్ నేతలతో జైట్లీ




ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం : ఆజాద్

ఆర్ధిక మంత్రి జైట్లీతో భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదం విషయంలో పార్టీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలకు ఏది ప్రయోజనమో అటునివైపే తాము మొగ్గు చూపుతామని.. తము తీసుకోవబోయే నిర్ణయం కూడా దీని ఆధారంగానే ఉంటుందని ఆజాద్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.