యాప్నగరం

అరుణాచల్‌లో మరో ట్విస్ట్... సీఎం జంప్

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.

Samayam Telugu 31 Dec 2016, 4:20 pm
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. సీఎం పెమా ఖండూను పార్టీ నుంచి పీపీఏ బహిష్కరించిన తెల్లారే బీజేపీ ఆయనకు పూర్తిగా మద్దతు ప్రకటించింది. దీంతో ఖండూ సహా పీపీఏకు చెందిన మరో 32 మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా బీజేపీ పూర్తి స్థాయి, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
Samayam Telugu arunachal gets full fledged govt as pema khandu and others join bjp
అరుణాచల్‌లో మరో ట్విస్ట్... సీఎం జంప్


యేడాదికాలంగా రాష్ట్రంలో ముగ్గురు సీఎంలు మారారు. పెమా ఖండూ బీజేపీలో చేరాక తన ఎమ్మెల్యేలతో బలనిరూపణ అయ్యాక మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. దీంతో అరుణాచల్ లో యేడాది కాలంలో నలుగురు సీఎంలు మారినట్లవుతుంది.

మొత్తం 60 మంది అసెంబ్లీ సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో మెజార్టీగా అంటే 31 మంది ఎమ్మెల్యే ఏ పార్టీకి ఉంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాట చేస్తారు. ఇన్నాళ్లు 43 మంది సభ్యులున్న పీపీఏ ఇప్పటి వరకు అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ నుంచి పీపీఏలో చేరిన పెమా ఖండూను క్రమశిక్షణ రాహిత్యం పేరిట పార్టీ బహిష్కరించింది. ఆయనతోపాటు స్పీకర్ పై కూడా బహిష్కరణ వేటు వేసింది.

పీపీఏలో కూడా కాంగ్రెస్ లాగే ఎమ్మెల్యేలకు గౌవరం లేదని, ఈ పార్టీల్లో ప్రజాస్వామ్యం లేదని పెమా ఉండూ శనివారం ఆరోపించారు. పార్టీ నుంచి బహిష్కరించే ముందు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం మాదిరే తమ రాష్ట్రంలోనూ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తాను పీపీఏకు చెందిన 33మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

దీంతో బీజేపీ సభ్యుల సంఖ్యాబలం 43కు చేరింది. ఇప్పటికే మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు ప్రకటించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి రెండు రోజుల్లో బీజేపీలో చేరబోతున్నారు. దీంతో పెమా ఖండూ నాయకత్వంలో బీజేపీ సభ్యుల సంఖ్యాబలం 49కి చేరుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.