యాప్నగరం

సరిహద్దుల్లో సైనికుల కోసం ఆశాభోస్లే పర్‌ఫార్మెన్స్

ప్రముఖ హిందీ నేపథ్యగాయని ఆశా భోస్లే మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. గడిచిన ఆరు దశాబ్ధాలుగా..

Maharashtra Times 13 May 2016, 3:44 pm
ప్రముఖ హిందీ నేపథ్యగాయని ఆశా భోస్లే మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. గడిచిన ఆరు దశాబ్ధాలుగా హిందీ సినీపరిశ్రమతో తన పాటల అనుబంధాన్ని పెనవేసుకున్న ఆశాభోస్లే.. సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాస్తున్న పారామిలిటరీ సైనిక బలగాలని తన గాత్రంతో అలరించేందుకు ముందుకొచ్చారు. అది కూడా తనకి తానుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజుకి తెలిపారు. మహారాష్ర్టలో ఓ ఫంక్షన్‌లో కలిసిన సందర్భంలో ఆశా భోస్లే ఈ విషయాన్ని తనకి చెప్పారని.. అప్పుడామె తీసుకున్న నిర్ణయం తనకెంతో నచ్చిందని కిరణ్ అన్నారు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో ఆశాని సరిహద్దుల్లోకి తీసుకెళ్లనున్నట్టు కిరణ్ చెప్పారు. వాఘా సరిహద్దు బార్డర్ పోస్ట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లోని ఇతర సరిహద్దు ప్రాంతాల్ని ఆశా భోస్లే సందర్శించనున్నారు. చిన్నప్పటి నుంచీ ఆశాభోస్లే పాటలు వింటూ పెరిగాం. ఆశా గారు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందం కలిగించింది అని కిరణ్ పీటీఐకీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Samayam Telugu asha bhosle to perform at border posts for soldiers
సరిహద్దుల్లో సైనికుల కోసం ఆశాభోస్లే పర్‌ఫార్మెన్స్


SOURCE :
http://maharashtratimes.indiatimes.com/nation/asha-bhosle-to-perform-at-border-posts-for-paramilitary-jawans/articleshow/52247026.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.