యాప్నగరం

నదిలో బోటు మునక.. ప్రమాద సమయంలో పడవలో 45 మంది

అస్సాంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మర బోటు నదిలో మునిగిపోయింది. సగం మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా.. మరో సగం మందిని అధికారులు కాపాడారు.

Samayam Telugu 17 Oct 2019, 10:44 pm
45 మంది ప్రయాణికులతో వెళ్తున్న మర పడవ ఒకటి నదిలో మునిగిపోయింది. అసోంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలో గురువారం (అక్టోబర్ 17) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ జియా భరలి నదిలో.. లాల్‌ తపూ సమీపంలోని బిహియా గావ్‌ నుంచి తేజ్‌పూర్‌లోని పంచ్‌ మైల్‌ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Samayam Telugu Representative Image


ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 45 మంది ఉన్నారు. వీరిలో 22 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన మరో 22 మందిని రెస్క్యూ టీమ్ కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చింది. గల్లంతైన మరో వ్యక్తి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తోంది.

Also Read: ఫైఅధికారి లైంగిక వేధింపులు.. మహిళా ఉద్యోగి ఆత్మహత్య

ప్రతి గురువారం ఏర్పాటు చేసే వారంతపు సంత కోసం స్థానికులు మర బోటుల్లో పంచ్‌ మైల్‌కు వెళ్తుంటారు. ప్రమాదం జరిగిన బోటులో మోటారు వాహనాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పడవలో ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలియగానే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, జిల్లా ఆధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.