యాప్నగరం

కంటతడి పెట్టిస్తున్న వరదలు.. కకావికలమవుతున్న మూగజీవాలు!

నీటిలో మునిగిపోయి చాలా జంతువులు మృత్యువాత‌ పడుతున్నాయి. మరి కొన్ని బిక్కుబిక్కుమంటూ.. ఎత్తుగా ఉన్న ప్రదేశాల వైపు పరుగు పెడుతున్నాయి. ఈ క్రమంలో..

TNN 13 Jul 2017, 6:52 pm
అసోంలో ఎడతెరపి లేని వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా బుధవారం (జులై 12) వరకు ఆ రాష్ట్రంలో 44 మంది మరణించారు. 24 జిల్లాల్లో 17.2 లక్షల మంది వరదల బారిన పడ్డారు. 25 వేల గ్రామాలు నీట మునిగాయి. మరోవైపు వరదల కారణంగా క‌జిరంగా జాతీయ పార్క్ నీటితో నిండిపోవడంతో మూగజీవాలు విలవిలలాడుతున్నాయి.
Samayam Telugu assam flood situation worsens animals in kaziranga park at risk
కంటతడి పెట్టిస్తున్న వరదలు.. కకావికలమవుతున్న మూగజీవాలు!


ఎడతెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల కజిరంగా పార్కు 75 శాతం వరకూ మునిగిపోయింది. నీటిలో మునిగిపోయి చాలా జంతువులు మృత్యువాత‌ పడుతున్నాయి. మరి కొన్ని బిక్కుబిక్కుమంటూ.. ఎత్తుగా ఉన్న ప్రదేశాల వైపు పరుగు పెడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై కొన్ని మరణిస్తున్నాయి. మరోవైపు ఇదే అదనుగా కొంత మంది వేటగాళ్లు మూగజీవాలపై విరుచుకు పడుతున్నారు.

బుధవారం ఒక్క రోజే నీటిలో మునిగిపోయి 6 జింకలు మరణించాయి. రోడ్డు ప్రమాదాల్లో మరో 10 ప్రాణాలొదిలాయి. కజిరంగా పార్క్‌కు ప్రత్యేకమైన రైనోలు (ఒంటికొమ్ము ఖడ్గమృగాలు) కూడా నీటి ప్రవాహంతో స‌త‌మ‌త‌ం అవుతున్నాయి. చుట్టూ నీరు ముంచెత్తడంతో మధ్యలో చిక్కుకుపోయి.. ఎటు వెళ్లాలో తెలియక మూగజీవాలన్నీ అటూ ఇటూ పరుగెడుతున్న దృశ్యాలు మనసును కలచి వేస్తున్నాయి.

జంతువుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించడానికి అధికారులు విశ్వ ప్రయ‌త్నం చేస్తున్నారు. వ‌ర‌ద ధాటి పెర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏనుగులు, రైనోలు, జింకలను క‌ర్బీ కొండ ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వేట‌గాళ్ల నుంచి మూగజీవాలను కాపాడేందుకు ఫారెస్ట్ గార్డులు పగలూ రాత్రి బోట్లలో తిరుగుతూ కాపలా కాస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.