యాప్నగరం

Lady Singham రోడ్డు ప్రమాదంలో ‘లేడీ సింగం’ మృతి.. హత్యా? ప్రమాదమా?

Lady Singham అసోంలోని ఓ మహిళా పోలీస్ అధికారిణి పేరు చెబితే కొన్ని చోట్ల హడలెత్తిపోతారు. ఆమె తన పనితీరుతో ఎంత గుర్తింపు పొందారా? వివాదాలతోనూ అంతే పేరు తెచ్చుకున్నారు. కానీ, ఆమె సోమవారం రాత్రి జరిగిన ఓ ప్రమాదంలో చనిపోవడం కలకలం రేగుతోంది. ప్రమాద సమయంలో వాహనం ఆమే స్వయంగా నడుపుతున్నారు. అర్ధరాత్రి తర్వాత ఆమె ఎక్కడకు వెళ్తున్నారు? ఎవరైనా ప్లాన్ చేసి ఆమెను హత్య చేశారా? అనేది తెలిాయాల్సి ఉంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 17 May 2023, 11:46 am

ప్రధానాంశాలు:

  • లేడీ సింగంగా గుర్తింపు పొందిన అసోం మహిళా ఎస్ఐ
  • వాహనం నడుపుకుంటూ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
  • వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన జున్‌మెరా రాభా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Lady Singham
పలు వివాదాలతో వార్తల్లో నిలిచి, ‘లేడీ సింగం’గా గుర్తింపు పొందిన అసోం పోలీస్ విభాగం మహిళా అధికారిణి అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మహిళా ఎస్సై జున్‌మోనీ రాభా (Junmoni Rabha) ప్రయాణిస్తున్న కారును.. ఎదురుగా వస్తున్న ఓ భారీ కంటైనర్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మోరికొలాంగ్‌ పోలీస్‌ ఔట్‌పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జున్‌మోనీ రాభా.. సోమవారం అర్థరాత్రి తన ప్రైవేటు కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదం కాదని, హత్యని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి వస్తున్న ఓ భారీ కంటెయిన్.. జాఖలాబంధా స్టేషన్‌ పరిధిలోని సరుభుగియా గ్రామం వద్ద జాన్‌మోనీ కారును ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలతో ఉన్న జున్‌మోనీని వాహనం నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కానీ, రాభా సివిల్‌ దుస్తుల్లో ఉండటం వల్ల ఆ సమయంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలియరాలేదని జిల్లా ఎస్పీ వెల్లడించారు. అయితే, ఆమె తల్లి సుమిత్రా రాభా మాత్రం ఇది పక్కా పథకంతో చేసిన హత్య అని ఆరోపించారు.

అసోం పోలీసు విభాగంలో పనిచేస్తోన్న జున్‌మోనీ రాభా.. నాగాన్‌ జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు. విధుల్లో కఠినంగా వ్యవహరిస్తూ తనదైన పనితీరుతో ఆ ప్రాంతంలో ‘లేడీ సింగం’, ‘దబాంగ్‌ పోలీస్‌’గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఆమెను పలు వివాదాలూ చుట్టుముట్టాయి. అవినీతి ఆరోపణలపై గతేడాది జూన్‌లో అరెస్ట్ కావడంతో కొంతకాలం సస్పెన్షన్‌లో ఉన్నారు. సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి ఆమె విధుల్లో చేరిన ఆమెకు మోరికొలాంగ్ ఔట్‌పోస్ట్ ఇంఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. అంతేకాకుండా ఓ బీజేపీ ఎమ్మెల్యేతో జరిపిన టెలిఫోన్‌ సంభాషణ కూడా వివాదాస్పదమైంది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.