యాప్నగరం

త్వరలో ఏటీఎంల్లో రూ. 50, రూ. 20 నోట్లు

త్వరలో ఏటీఎంల్లో రూ. 50, రూ. 20 నోట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్టేట్ ‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

TNN 15 Nov 2016, 11:43 am
త్వరలో ఏటీఎంల్లో రూ. 50, రూ. 20 నోట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్టేట్ ‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటీఎంల వద్ద రద్దీ తగ్గిన తరవాత ఈ చిన్న నోట్లను ఏటీఎంలో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
Samayam Telugu atms to dispense rs 50 20 notes soon
త్వరలో ఏటీఎంల్లో రూ. 50, రూ. 20 నోట్లు


పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం ఏటీఎంల్లో కేవలం రూ. 100 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇవి కూడా చాలా త్వరగా ఖాళీ అయిపోతుండటంతో ఏటీఎం షటర్లు మూతబడుతున్నాయి. ఏటీఎంల్లో రూ. 8.8 లక్షల వంద నోట్లను మాత్రమే ఉంచగలమని అందుకే అవి త్వరగా ఖాళీ అయిపోతున్నాయని బ్యాంకులు వెల్లడిస్తున్నాయి. మరి అలాంటప్పుడు రూ. 50, రూ. 20 పెడితే ఏటీఎంల్లో క్యాష్ మరింత తగ్గిపోతుంది. దీంతో ఇంకొంచెం వేగంగా ఏటీఎంలు ఖాళీ అవుతాయి.

కాకపోతే కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు కూడా ఏటీఎంల్లో అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాబట్టి ఇకపై బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఈ పెద్ద నోట్లను, రూ. 50, రూ. 20 నోట్లను అందుబాటులో ఉంచుతాయి. అప్పుడు ఏటీఎంల్లో ఎక్కువ క్యాష్ పడుతుంది. డబ్బులు డ్రా చేసుకునే వినియోగదారులకు కూడా పెద్ద, చిన్న నోట్లు కలిపి వస్తాయి. కాకపోతే దీనికి కొంత సమయం పట్టొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.