యాప్నగరం

Shraddha Murder Case: ఆఫ్తాబ్ పూనావాలాపై దాడి... వాహనంలో తరలిస్తుండగా కత్తులతో...

ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. శ్రద్ధా వాల్కర్ కేసులో (Shraddha Murder Case) నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలాపై దాడి జరిగింది. అతనిని పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని వారించారు. అనంతరం శ్రద్ధావాల్కర్‌కు న్యాయం చేయాలనుకున్నామని ఆ యువకులు మీడియాకు చెప్పినట్టు తెలుస్తుంది. కాగా సోమవారం ఆఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ నిర్వహించారు. ఆ సందర్భంగా నిందితుడు నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టినట్టు సమాచారం.

Authored byAndaluri Veni | Samayam Telugu 28 Nov 2022, 7:35 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో ఆఫ్తాబ్ పూనావాలాపై దాడి
  • పోలీసు వ్యాన్‌ను ఆపేందుకు యత్నించిన యువకులు
  • కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నం
  • ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో పాలిగ్రాఫ్ టెస్ట్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Shraddha Murder Case
శ్రద్ధా వాల్కర్ హత్య కేసులో నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలాపై దాడి జరిగింది. ఢిల్లీలోని రోహిణిలో FSL ల్యాబ్‌ నుంచి బయటకు తీసుకొచ్చి.. వాహనంలో తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్తాబ్ పూనావాలాను పాలిగ్రాఫ్ పరీక్ష కోసం సోమవారం రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అది పూర్తయ్యాక.. అక్కడ నుంచి జైలుకు తరలించేందుకు పోలీసులు వాహనం ఎక్కించారు. ఆ సమయంలో కొంతమంది యువకులు కత్తులతో ఆఫ్తాబ్‌పై దాడికి ప్రయత్నించారు. పోలీసు వ్యాన్‌ను బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డుకుని ఆపడానికి కూడా ట్రై చేశారు. కానీ పోలీసులు వారిని నిలువరించారు.
సంచలన కేసు...
తనతో సహజీవనం చేసిన శ్రద్ధా వాల్కర్‌ని.. అఫ్తాబ్ వాల్కర్‌ని అతి కిరాతకంగా హత్య చేశాడు. 35 ముక్కలుగా చేసి.. ఫ్రిజ్‌లో పెట్టి.. ఆపై వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. అయితే ఆరు నెలల తర్వాత ఈ విషయం బయటకొచ్చింది. శ్రద్ధా వాల్కర్ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయడంతో.. మొత్తం విషయం బయటకొచ్చింది. వెంటనే అఫ్తాబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో కూడా అఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు.

ఈ క్రమంలో అఫ్తాబ్‌ను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్ ప‌రీక్ష నిర్వహించారు. శ్ర‌ద్ధాను ముక్క‌లు చేసేందుకు అత‌ను ఐదు కత్తులు వాటినట్టు ఆ పరీక్షలో వెల్లడించినట్టు తెలు్సతుంది. ఆ కత్తులను కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది.

పాలిగ్రాఫ్ టెస్ట్...
పాలిగ్రాఫ్ టెస్ట్‌నే లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు. నిందితుల నుంచి నిజాలు రాబట్టేందుకు దీనిని వాడుతుంటారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానాలు చెప్పేటప్పుడు వారి శరీరం ఎలా స్పందిస్తోందన్నది మెషిన్ గుర్తిస్తుంది. బీపీ, గుండె కొట్టుకునే రేటు, శ్వాస వేగాన్ని మెషిన్ గమనిస్తుంది. ఆ క్రమంలో నిందితుడు అబద్ధం చెబుతున్నాడో.. నిజం చెబుతున్నాడో తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ పరీక్షలో ఎలాంటి మత్తు మందులు ఉపయోగించరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.