యాప్నగరం

Punjab: పదునైన కత్తులతో స్కూల్ బస్సుపై దాడి... వాహనంలో 35 మంది చిన్నారులు

పంజాబ్‌లో (Punjab) బర్నాలలో భయానకమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌ బస్సుపై దుండగులు పదునైన కత్తులతో దాడి చేశారు. బస్సును వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. డ్రైవర్‌ను బస్సు ఆపమని బెదిరించారు. ఆయన ఆపకపోవడంతో ఆయుధాలతో బస్సు అద్దాలను పగలగొట్టారు. ఆ సమయంలో వాహనంలో 35 మంది చిన్నారులున్నారు. అయితే డ్రైవర్ వెంటనే బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దాంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 17 Aug 2022, 1:15 pm

ప్రధానాంశాలు:

  • పంజాబ్‌లో భయాకరమైన ఘటన
  • వెంబడించి మరీ దాడి చేసిన దుండగులు
  • బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Attack on school bus
స్కూల్ బస్సుపై (Punjab) దుండగులు దాడి చేశారు. కత్తులతో బైక్‌పై వెంబండించి మరీ బస్సుపై విరుచుకుపడ్డారు. బస్సు డ్రైవర్‌ను కొట్టారు. దాంతో ఆయనకు గాయాలయ్యాయి. బస్సు కూడా ధ్వంసమైంది. ఈ సంఘటన పంజాబ్ బర్నాలలో చోటుచేసుకుంది. ఇది జరిగినప్పుడు బస్సులో 35 మంది చిన్నారులు ఉన్నారు. పిల్లలను వారి వారి ఇళ్లలో దింపేందుకు వెళ్తున్న సమయంలో ఇది జరిగింది.
నాలుగు మోటార్ సైకిళ్లపై దుండుగులు స్కూల్ బస్సును వెంటాడారు. బస్సును ఆపాలని డ్రైవర్‌ను గద్దించారు. కానీ చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్‌ బస్సును ఆపలేదు. దాంతో దుండగులు బైక్‌పై నుంచే ఆయుధంతో బస్సుపై దాడి చేశారు. బస్సు అద్దాలను పగులగొట్టారు. దాంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ బస్సును వేగంగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దాంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నారులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు వెంటనే అప్రమత్తమై.. పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు.

తర్వాత బస్సు డ్రైవర్‌ను పోలీసులు విచారించారు. అయితే కొద్దిరోజుల క్రితం కొంతమంది వ్యక్తులు తనతో గొడవ పడ్డారని, దానిపై ప్రతీకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని బస్సు డ్రైవర్ చెప్పాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్ట పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులను గుర్తించామని.. వారిలో ఒకరిని పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అయితే స్కూల్ బస్సుపై దాడిపై చిన్నారుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణమైన విషయం కాదంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నారు. తమ పిల్లలు బస్సులో ప్రతిరోజూ స్కూల్‌కు వెళ్తుంటారని, ఇలాంటి దాడులు జరగడం చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటివి జరగక్కుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.