యాప్నగరం

నల్లా కనెక్షన్ వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ.. ఇద్దరు మృతి

నల్లా కనెక్షన్ విషయమై చోటు చేసుకున్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసి రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

Samayam Telugu 12 May 2018, 6:32 pm
నల్లా కనెక్షన్ విషయమై చోటు చేసుకున్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసి రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమ నీటి కనెక్షన్లపై మున్సిపాలిటీ అధికారులు డ్రైవ్‌ చేపట్టారు. నగరంలోని మోటికారంజాలో ఓ మతానికి సంబంధించిన వారు అధికంగా నివసించే ప్రాంతంలో నీటి కనెక్షన్‌ను తొలగించారు. దీంతో ఆ వర్గం వారు ఆందోళనకు దిగారు.
Samayam Telugu clash

పక్కనే ఉన్న వేరే మతానికి చెందిన ప్రదేశంలోనూ ఇలాంటి కనెక్షనే ఉందని, దాన్ని కూడా తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య శుక్రవారం (మే 11) రాత్రి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

శనివారం ఉదయం వరకు ఈ అల్లర్లు ఔరంగాబాద్‌ అంతటికీ వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 35 మంది గాయపడ్డారు. ఆందోళనకారులు 50కి పైగా దుకాణాలకు, పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లదాడికి దిగారు. ఏ క్షణంలో ఏ జరగనుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఔరంగాబాద్ అల్లర్లు


పరిస్థితి చేజారకుండా పోలీసులు ఔరంగాబాద్ నగర పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. లాఠీఛార్జ్ చేసి అల్లరిమూకలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.