యాప్నగరం

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి.. సీఎస్ఐఆర్‌తో జత కట్టిన అరబిందో ఫార్మా

కరోనా వైరస్‌ను అరికట్టడం కోసం వ్యాక్సిన్‌ను రూపొందించడానికి సీఎస్ఐఆర్, అరబిందో ఫార్మా జత కట్టాయి. సీఎస్ఐఆర్ ల్యాబ్‌లు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తే.. క్లినికల్ డెవలప్‌మెంట్, వాణిజ్య ప్రక్రియను అరబిందో చూసుకుంటుంది.

Samayam Telugu 15 Sep 2020, 10:46 pm
కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల రూపకల్పన కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), అరబిందో ఫార్మా జత కట్టాయి. సీఎస్ఐఆర్-సీసీఎంబీ, అరబిందో ఫార్మా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. అనేక నోవల్ కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం సీఎస్ఐఆర్‌తో అరబిందో జతకడుతుంది. సీఎస్ఐఆర్ పరిశోధనశాలలైన సీసీఎంబీ హైదరాబాద్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ, చండీగఢ్ అండ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీలు విభిన్న రకాలైన కరోనా వ్యాక్సిన్ క్యాండిటేట్లను రూపొందిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ల క్లినికల్ డెవలప్‌మెంట్, వాణిజ్య ప్రక్రియను అరబిందో చూసుకుంటుంది.
Samayam Telugu Covid vaccine


కరోనాపై పోరాటంలో వ్యాక్సిన్ల రూపకల్పన కోసం సీఎస్ఐఆర్‌తో చేతులు కలపడం తమకు గర్వకారణంగా ఉందని అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గోవిందరాజన్ ప్రకటించారు. అరబిందో సంస్థ ఇప్పటికే తన అమెరికన్ సబ్సిడరీ అరో వ్యాక్సిన్స్ ద్వారా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.

పుణేలోని వైరాలజీ ల్యాబ్, ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంస్థలు కలిసి కొవాక్సిన్ పేరిట కరోనా వైరస్ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ భారత్‌లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.