యాప్నగరం

ఆటో డ్రైవర్ నిజాయితీ..బహుమతిగా పిల్లలకు ఫ్రీ చదువు

రోడ్డు మీద వెళుతుంటే... ఏదైనా వస్తువో, డబ్బో, బంగారం దొరికితే ఏం చేస్తాం. మంచివాళ్లమైతే పొగోట్టుకున్నవాళ్లు ఎవరో తెలుసుకొని తిరిగి అప్పగిస్తాం... లేదంటే సైలెంట్‌గా రెండో కంటికి కూడా తెలియకుండా నొక్కేస్తాం. నేటి సమాజంలో చాలామంది ఇలా నొక్కేసే బ్యాచ్ ఉన్నారు. పోగొట్టుకున్న వ్యక్తులకు తెలుసు ఆ వస్తువులకు ఉన్న విలువ. ఒక్కోసారి మనం చూపించే నిజాయితీ కూడా మనకు మంచి చేస్తుంది. ముంబైలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

TNN 10 Mar 2018, 1:03 pm
రోడ్డు మీద వెళుతుంటే... ఏదైనా వస్తువో, డబ్బో, బంగారం దొరికితే ఏం చేస్తాం. మంచివాళ్లమైతే పొగోట్టుకున్నవాళ్లు ఎవరో తెలుసుకొని తిరిగి అప్పగిస్తాం... లేదంటే సైలెంట్‌గా రెండో కంటికి కూడా తెలియకుండా నొక్కేస్తాం. నేటి సమాజంలో చాలామంది ఇలా నొక్కేసే బ్యాచ్ ఉన్నారు. పోగొట్టుకున్న వ్యక్తులకు తెలుసు ఆ వస్తువులకు ఉన్న విలువ. ఒక్కోసారి మనం చూపించే నిజాయితీ కూడా మనకు మంచి చేస్తుంది. ముంబైలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ డ్రైవర్ నిజాయితీతో... అతడి పిల్లలకు ఉచితంగా విద్య బహుమతిగా అందింది.
Samayam Telugu auto driver returns bag earns free education for his kids
ఆటో డ్రైవర్ నిజాయితీ..బహుమతిగా పిల్లలకు ఫ్రీ చదువు


చెంబూరు ప్రాంతంలో అరుణోదయ ఇంగ్లీష్ స్కూల్ నిర్వహిస్తున్న నంబూద్రి అనే మహిళ ఓ ఆటో ఎక్కింది. అయితే పొరపాటున డబ్బులు, క్రెడిట్, డెబిట్ కార్డులున్న బ్యాగ్‌ను మర్చిపోయి దిగింది. గమనించకుండా స్కూల్‌కు వెళ్లిపోయింది. తర్వాత బ్యాగ్‌ను గమనించిన డ్రైవర్ అమిత్ గుప్తా... దాన్ని తీసుకొని స్కూల్‌కు వెళ్లి నంబూద్రికి తిరగి ఇచ్చాడు. అతడి నిజాయితీని మెచ్చుకున్న ఆమె... పదివేల రూపాయలు బహుమతిగా ఇచ్చింది. అలాగే అతడి పిల్లలకు తన స్కూల్లో ఉచితంగా చదువు అందిస్తానని హామీ ఇచ్చింది. అమిత్ గుప్తాను అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే పిల్లలకు ఉచితంగా చదువు చెప్తానన్న నంబూద్రిని అభినందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.