యాప్నగరం

వైద్యులు మద్యానికి దూరంగా ఉండండి: ఐఎంఏ

గౌరవమైన వృత్తిలో ఉన్న వైద్యులు మద్యానికి దూరంగా ఉండాలని భారతీయ వైద్య మండలి సూచించింది. అంతేకాదు వారు తీసుకోవాల్సిన మద్యం పరిమితులను కూడా తెలిపింది.

Samayam Telugu 26 Jun 2017, 2:51 pm
వైద్యులు మద్యపానానికి దూరంగా ఉంటూ, సమాజంలో ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి ప్రచారకర్తలుగా వ్యవహరించాలని భారతీయ వైద్య మండలి సూచించింది. మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి వైద్యుల సాయం తీసుకోవాలని ఐఎంఏ భావిస్తోంది. దీని కోసం వైద్యులు దినోత్సవం జులై 1, ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబరు 5 న స్వచ్ఛందగా ముందుకు రావాలని కోరింది. వైద్యులు మద్యపానం వల్ల కలిగే అనర్థాల గురించి ఈ రోజుల్లో చైతన్యం కలిగించాలని తెలిపింది. అంతే కాదు వైద్యుల మద్యపాన సేవనం స్థాయిలపై కూడా పరిమితిలను విధించింది. మహిళ వైద్యులు 9 ఎంఎల్, పురుషులు దీనికి రెట్టింపు అంటే 18 ఎంఎల్ కంటే ఎక్కువ సేవించరాదని ఐఎంఏ పేర్కొంది.
Samayam Telugu avoid drinking with non doctors says ima
వైద్యులు మద్యానికి దూరంగా ఉండండి: ఐఎంఏ


మద్యపానాన్ని నిషేధించాలని వార్షిక సమావేశంలో ఐఎంఏ ఆదేశించడంపై వైద్యులు కృత‌ఙ్ఞ‌త‌లు తెలిపినట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను వైద్యులు, ఇతర సభ్యుల ద్వారా ప్రజల్లో ప్రచారం చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రచారకర్తలుగా ఉండే వైద్యులు అనారోగ్య అలవాట్లకు దూరంగా ఉండి హుందాగా వ్యవహరించాలని ఆదేశించింది. రోగులతో సక్రమంగా వ్యవహరించడం కూడా ఐఎంఏ ప్రవర్తన నియమావళిలో భాగం. ఒక రోగి వైద్యుడిని విశ్వసించాలంటే నమ్మకం కలిగించాలి.... అతడి అసంబద్ధమైన ప్రవర్తన నమ్మకాన్ని నాశనం చేయడమే కాదు, వృత్తికే చెడ్డపేరు వస్తుందని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.