యాప్నగరం

మందిరం కోసం వాదించిన ఆ న్యాయవాది ఎమోషన్ ఇలా..

Ayodhya: అయోధ్యలో రామమందిరం 500 ఏళ్ల నాటి కల. ఆ స్వప్నం రెండు, మూడేళ్లలో సాకారం కాబోతోంది. ఆ అపురూప క్షణాలను భారతీయులు టీవీ తెరలపై చూసి తరించారు.

Samayam Telugu 6 Aug 2020, 12:55 am
యోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంటే దేశమంతా భక్తి పారవశ్యంతో ఊగిపోయింది. టీవీ తెరలకు అతుక్కుపోయి ఆ అపురూప దృశ్యాలను చూశారు. అయోధ్యలో ఆ చారిత్రక ఘట్టం సాక్ష్యాత్కరించడానికి కారణమైన వారి అనుభూతి ఇక మాటల్లో చెప్పలేనిది. అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కేసు వాదించిన న్యాయవాది కె పరాశరన్. తమిళనాడుకు చెందిన ఈ సీనియర్ లాయర్.. ఒకనాటు సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తుండగా.. ధర్మాసనం ఆయణ్ని కూర్చొని మాట్లాడాల్సిందిగా సూచించింది. కానీ, ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించి ఆ వయసులోనూ నిల్చునే మాట్లాడారు.
Samayam Telugu లాయర్ పరాశరన్
Ayodhyta Case Lawyer


అయోధ్య కేసులో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంతో పరాశరన్ పాత్ర వెలకట్టలేనిది. అయోధ్యలో బుధవారం (ఆగస్టు 5)న రామమందిర నిర్మాణానికి పునాది రాయి పడుతున్న వేళ ఆయన ఆ దృశ్యాలను తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి టీవీ తెరపై వీక్షించారు. ఈ సందర్భంగా ఆయనలో భక్తి పారవశ్యం తొణికిసలాడింది. పరాశరన్ కుటుంబసభ్యులు కూడా భక్తితో చేతులు జోడించడం ఫోటోలో కనిపిస్తోంది.

దశాబ్దాలుగా కోట్లాది మంది నిరీక్షిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ తంతు కొనసాగింది. ముహూర్తం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.44.08కి ఆయన శంకుస్థాపన చేశారు.

భూమి పూజకు ముందు ప్రధాని మోదీ హనుమాన్‌గఢీ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ హనుమంతుడు చూసుకుంటాడని.. రామ మందిర నిర్మాణం కార్యక్రమం కూడా ఆయన ఆశీస్సులతో ప్రారంభిస్తున్నామని ఆ తర్వాత ప్రధాని మోదీ చెప్పారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడి విగ్రహం ముందు ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. వేదికపై ప్రసంగించడానికి ముందు అతిథులకు కూడా ఆయన ఇలాగే సాష్టాంగ ప్రణామం చేయడం విశేషం. అతిథుల్లో 130 మంది మతపెద్దలే ఉన్నారు.

Also Read: అక్కడే మసీదు ఉండేది.. నేనూ ఎమోషనయ్యా: అసదుద్దీన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.