యాప్నగరం

నదిలో పవిత్ర స్నానం చేస్తుండగా.. భర్తకు ముద్దుపెట్టిన భార్య.. పాపం ఆయనకు మూడింది!

Ayodhya: నదిలో అందరూ పవిత్ర స్నానం చేస్తుండగా.. ఓ భార్య భర్తకు ముద్దు పెట్టింది. అతడు ఒకింత ఇబ్బందిపడుతూనే.. భార్య ప్రయత్నాన్ని వారించలేకపోయాడు. అదే అతడు చేసిన తప్పిదమైంది. చుట్టూ ఉన్న జనం అతణ్ని పక్కకు లాగి నాలుగు తగలించారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 23 Jun 2022, 3:11 pm

ప్రధానాంశాలు:

  • సరయూ నదిలో భర్తకు ముద్దు పెట్టిన భార్య
  • నదిలో స్నానం చేస్తున్న సాటి భక్తుల ఆగ్రహం
  • ఇద్దర్నీ నదిలో నుంచి బయటకు గెంటేసిన జనం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sarayu River
Sarayu River
ఉత్తరప్రదేశ్: అది అయోధ్యలోని సరయూ నది. భక్తులంతా నీళ్లలోకి దిగి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఇంతలో నదిలో స్నానం చేస్తున్న ఓ జంట ముద్దులు పెట్టుకునే ప్రయత్నం చేసింది. వారిద్దరిని అలా చూసిన చుట్టు పక్కల వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే.. భార్య ముద్దు పెడుతుండగా.. భర్తను పక్కకు లాగి నాలుగు తగిలించారు. భార్య తన భర్తను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది. అయోధ్యలో ఇలాంటి పాడు పనులను సహించేది లేదని తేల్చి చెప్పారు. భార్యాభర్తలిద్దర్నీ నదిలో నుంచి బయటకు పంపించేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయోధ్యలోని ఇంఛార్జ్ ఇన్స్‌పెక్టర్‌ను విచారణకు ఆదేశించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఆయోధ్య పోలీసులు ట్వీట్ చేశారు.
గంగా నదికి ఉన్న ఏడు ఉపనదుల్లో సరయూ నది ఒకటి. ఈ నదిని హిందువులు పవిత్రమైందిగా భావిస్తారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరం సరయూ నది ఒడ్డునే ఉంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.