యాప్నగరం

అయోధ్య రామ మందిరం ప్రారంభానికి డేట్ ఫిక్స్

Ayodhya Ram Mandir Opening Date: అయోధ్యలో రామ మందిరం ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయ్యింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులకు కానుకగా వచ్చే ఏడాది జనవరి 1న అయోధ్య రామాలయాన్ని ప్రారంభించనున్నారు. హోం మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలిపారు. త్రిపుర పర్యటనలో ఉన్న అమిత్ షా.. అయోధ్య రామ మందిరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా రామాలయాన్ని నిర్మిస్తున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 5 Jan 2023, 7:51 pm
Samayam Telugu Ayodhya Ram Temple
అయోధ్య రామ మందిరం
కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. చారిత్రక అయోధ్యపురిలో రామ మందిరం ప్రారంభం కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 1న అయోధ్యలో రామాలయం ప్రారంభిస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న త్రిపురలో అమిత్ షా నేడు (జనవరి 5) పర్యటించారు. రెండు రథయాత్రలను ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా.. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం గురించి ప్రకటన చేశారు.

2020 ఆగస్టు 5న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. నాటి నుంచి మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు.


రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు అయోధ్యాపురిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నారు. రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భూమి పూజ నిర్వహించడానికి ముందే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Photos: అత్యంత వైభవంగా అయోధ్య రామ మందిరం
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.