యాప్నగరం

కరెన్సీ రద్దు ప్రభావం వివాహాలపై ఉంటుందా?

కరెన్సీని రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు ముందే ఉంది.

TNN 10 Nov 2016, 1:38 pm
అన్ని రాజకీయ పార్టీలు నల్లధనాన్ని వ్యతిరేకిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత గులామ్ నమీ అజాద్ అన్నారు. కానీ కరెన్సీ రద్దు వివాహాలతోపాటు వ్యవసాయ రంగాలపై పెను ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ కూడా నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడుతుందని అజాద్ తెలిపారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.1,000, 500 నోట్లను రద్దు చేయడానికి ఇది సమయం కాదని ఆయన అన్నారు.
Samayam Telugu ban on currency impact both wedding and agriculture industries says congress
కరెన్సీ రద్దు ప్రభావం వివాహాలపై ఉంటుందా?

Even our party is against black money, but I think this will impact both wedding and agriculture industries: Ghulam Nabi Azad, Congress pic.twitter.com/hI6GAU4tPA — ANI (@ANI_news) November 10, 2016 దీనివల్ల అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కొంటారని ఆజాద్ పేర్కొన్నారు. మంగళవారం రూ.వెయ్యి, 500 కరెన్సీ నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడాన్ని అజాద్ తప్పుపట్డారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం నియంతృత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజాస్వామ్యంలో కాదని ఆయన దుయ్యబట్టారు. గత రెండేళ్ల నుంచి మోడీ అనుసరిస్తున్న విధానాలను గమనిస్తూ ఉన్నామని, కరెన్సీ నిషేధం నియంతృత్వాన్ని అతిపెద్ద ఉదాహరణ అని గులామ్ నబీ అజాద్ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.