యాప్నగరం

దారుణం: సిగిరెట్ డబ్బు కోసం ఇద్దరి హత్య

చిన్న, చిన్న కారణాలే తోటి మనుషుల ప్రాణాలు తీసే వరకు వెళుతున్నాయి. మరీ దారుణంగా రూ.100 కోసం కూడా హత్యలు జరిగిన సంఘటనలు చూశాం. కాని ఇక్కడ మాత్రం సిగిరెట్ల డబ్బు ఇవ్వలేదని ఇద్దరి నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.

Samayam Telugu 15 Jun 2018, 12:08 pm
చిన్న, చిన్న కారణాలే తోటి మనుషుల ప్రాణాలు తీసే వరకు వెళుతున్నాయి. మరీ దారుణంగా రూ.100 కోసం కూడా హత్యలు జరిగిన సంఘటనలు చూశాం. కాని ఇక్కడ మాత్రం సిగిరెట్ల డబ్బు ఇవ్వలేదని ఇద్దరి నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు. బెంగళూరులో జరిగిన ఈ దారుణం సంచలనంగా మారింది. బెంగళూరు తూర్పు పోలీస్ కమిషనర్ శీమంత్ కుమార్ సింగ్ చెప్పిన వివరాల మేరకు. కేజీ హళ్లి ప్రాంతానికి చెందిన అమిన్.. స్థానికంగా ఉన్న అలీ బడ్డీ కొట్టులో రూ.15 సిగిరెట్ తీసుకున్నాడు. అమిన్ సిగిరెట్ తీసుకున్నాడు కాని.. డబ్బు ఇవ్వకుండా వెళ్లబోయాడు.
Samayam Telugu Attack.


అమిన్ డబ్బు ఇవ్వలేదని గమనించిన అలీ అతడ్ని అడ్డగించాడు. డబ్బులివ్వాలని అడగ్గా.. అతడు మాత్రం తర్వాత ఇస్తానని చెప్పాడు. అలీ మాత్రం వెనక్కు తగ్గలేదు.. ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి అలీని తప్పించుకొని అమిన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కోపాన్ని మనసులో పెట్టుకొని అలీ జరిగిన విషయాన్ని ఫోన్ చేసి తన స్నేహితులకు చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఐదారుగురు ఇనుప రాడ్లు తీసుకొని ఆ బడ్డీ కొట్టు దగ్గరకు చేరుకున్నారు.

అలీ ఆ గ్యాంగ్‌ను వెంటేసుకొని అమిన్ కోసం వెతక్కగా.. కొద్దిసేపటికి దొరికాడు. వెంటనే రాడ్లు తీసుకొని అమిన్‌పై విరుచుకుపడ్డారు. ఈ గొడవను గమనించిన అతడి సోదరుడు మతిన్ అడ్డుపడ్డాడు. అతడ్ని కూడా వదలకుండా దాడి చేశారు. వీరి కేకలు విని స్థానికులు అక్కడికి రావడంతో వారు పారిపోయారు. మతిన్ స్పాట్‌లోనే చనిపోగా.. అమిన్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే చనిపోయిన అమిన్‌కు డ్రగ్స్ అలవాటుందని కూడా పోలీసులు చెబుతున్నారు. అతడిపై కొన్ని పోలీసు కేసులు ఉన్నాయట.

ఈ ఘటనలో ఆ గ్యాంగ్‌తో పాటూ బడ్డీ కొట్టు ఓనర్ అలీపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో కొందరు దొరకగా.. మిగిలిని వారి కోసం గాలిస్తున్నారు. రూ.15 కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకోగా.. బెంగళూరులో ఈ ఘటన సంచనలంగా మారింది.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.