యాప్నగరం

వర్షాలతో పశ్చిమ కనుమలకు కొత్త అందం!

రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ కనుమలు పులకరిస్తున్నాయి. రారమ్మంటూ పర్యాటకులను పిలుస్తున్నాయి.

Samayam Telugu 14 Jun 2018, 3:42 pm
రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ కనుమలు పులకరిస్తున్నాయి. రారమ్మంటూ పర్యాటకులను పిలుస్తున్నాయి. కురుస్తున్న జల్లులతో, జాలువారుతున్న జలపాతాలతో పశ్చిమ కనుమల్లో భాగమైన ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఆ ప్రాంతాలకు చెందిన నెటిజన్లు.. ప్రస్తుతం అక్కడ పర్యటిస్తున్న పర్యాటకులు అక్కడి ఫొటోలను తీసి ఇంటర్నెట్‌లో పోస్టు చేస్తున్నారు. అలాంటి ఫొటోలే ఇవి. ఫేస్‌బుక్ నుంచి తీసుకున్నవి.
Samayam Telugu 10


మొన్నటి వరకూ ఎండిపోయినట్టుగా ఉండిన జలపాతాలకు ఇప్పుడు జీవం వచ్చింది. ప్ర‌కృతి పచ్చదనాన్ని అందుకుంది. ఆ అందాలను వర్ణించడానికి ఈ పదాలు చాలా చిన్నవి. తనివితీరా వీటిని వీక్షించడమే తప్ప ఈ అందాలను వర్ణించడం అంత సులభం కాదు.

పశ్చిమకనుమల్లో భాగమైన కర్ణాటకలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ ప్రాంతంలో కొంత వర్షాలు ప్రమాదకరమైన స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పర్యాటకుల్లో కాస్త హుషారు తగ్గింది. అయితే వర్షాలు కాస్త తెరిపినిస్తే సాధారణ స్థాయికి చేరితే పశ్చిమ కనుమల్లో విహరించడానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. కాస్త వీలు చేసుకుని ఈ సీజన్లో పశ్చిమ కనుమల్లో విహరిస్తే అది మధురానుభూతే అవుతుంది.


మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.