యాప్నగరం

మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసినవారికి సైన్యం గట్టిగా బుద్ది చెప్పింది: ప్రధాని

సరిహద్దులో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారత్, చైనాల తమ బలగాలను భారీగా మోహరిస్తున్నాయి.

Samayam Telugu 28 Jun 2020, 1:10 pm
సరిహద్దుల్లో చైనాతో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తూర్పు లడఖ్‌లో మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన వారికి సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందని అన్నారు. సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. సైనికుల శౌర్య పరాక్రమాలే భారత బలమని ఉద్ఘాటించారు. గల్వాన్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు మోదీ తెలిపారు. సైనికులు ఎల్లవేళలా దేశాన్ని సురక్షితంగా ఉంచుతారని పేర్కొన్నారు.
Samayam Telugu మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi


సరిహద్దులు, సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటున్న భారత్‌ చిత్తశుద్ధిని ప్రపంచం మొత్తం చూసిందని గుర్తుచేశారు. డ్రాగన్‌ దుర్బుద్ధితో సరిహద్దులను ఆక్రమించుకోవాలని చూస్తోందని మోదీ దుయ్యబట్టారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ మేకిన్ ఇండియాకు మద్దతు తెలుపుతున్నారని, స్వదేశీ వస్తువులవైపే మొగ్గు చూపుతున్నారని వివరించారు. భారత పురోభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.

స్నేహం స్ఫూర్తిని భారత్ గౌరవిస్తుందని, శత్రువుకు దూరంగా ఉండకుండా తగిన విధంగా స్పందించగలదని చైనా పేరు ప్రస్తావించకుండా నర్మగర్బ వ్యాఖ్యలు చేశారు. 'అన్‌లాక్ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరాన్ని పాటించడంలో విఫలమైతే, తమతోపాటు ఇతరులకు హాని కలిగిస్తారని అన్నారు.

ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతంకాదని, ఓ పౌరుడిగా దేశాన్ని తయారు చేయడంలో మీ సంకల్పం, భక్తి, సహకారాన్ని తాను కోరుతున్నాను అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.