యాప్నగరం

బెంగళూరులో జాతి వ్యతిరేక నినాదాలు?

బెంగళూరులో దేశ వ్యతిరేక నినాదాల ఉదంతంపై పెద్ద వివాదం రేగింది.

TNN 16 Aug 2016, 8:50 pm
రెండు రోజుల క్రితం ప్రముఖ అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బెంగళూరు నగరంలో కశ్మీర్ సమస్యపై ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్థాన్ కు అనుకూలంగా, కాశ్మీర్ స్వేచ్చ కోసం నినాదాలు పెద్ద పెట్టున రేగినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) స్థానిక శాఖ మంగళవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో నగరంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా ఆర్సీ కాలేజీ నుండి బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో వారు అక్కడ పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. జాతివ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆమ్నేస్టి సంస్థను దేశంలో నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఆమ్నేస్టి నిర్వహించిన కార్యక్రమంలో జాతివ్యతిరేక నినాదాలు జరిగాయా లేదా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu bengaluru abvp members protest against amnesty international
బెంగళూరులో జాతి వ్యతిరేక నినాదాలు?


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.