యాప్నగరం

Bengaluru: భర్త దుబాయ్‌లో ఉంటాడని నమ్మించి యువకుడిపై వలపు వల విసిరి...

హనీట్రాప్‌ మోసాలు ఆగడం లేదు. అడ్డదారిలో డబ్బులు సంపాదనకు అలవాటుపడిన కొందరు.. వ్యాపారులు, ప్రముఖులను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వల వేయడమే, లేకపోతే నేరుగా ముగ్గులోకి దింపడమో చేసి.. బెదిరింపులకి పాల్పడుతూ, వారి దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఓ ముఠా బెంగళూరులో యువ పారిశ్రామికవేత్తను ట్రాప్ చేసింది. టెలిగ్రామ్‌లో అతడితో స్నేహం చేసి.. నేరుగా తన ఇంటికి పిలిపించి.. ఎఫైర్ అంటగట్టేందుకు ట్రై చేశారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 21 Mar 2023, 12:26 pm

ప్రధానాంశాలు:

  • టెలిగ్రామ్‌లో యువ వ్యాపారవేత్తతో పరిచయం
  • ఏకాంతంగా గడుపుదామని ఆఫర్ ఇచ్చిన మహిళ
  • సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు యువకులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Honeytrap
బెంగళూరులో నగరంలో మరో హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్ ముఠా వలలో పడిన ఓ యువ పారిశ్రామికవేత్త (28).. వారి బెదిరింపులతో భయపడ్డాడు. చివరకు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పుట్టేనహళ్లి పోలీసులు మెహర్‌ అనే యువతితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల్లోకి వెళ్తే.. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మెహర్ అనే యువతితో యువ పారిశ్రామికవేత్తకు పరిచయమైంది. ఇద్దరూ తరచూ చాటింగ్‌ చేసుకునేవారు. ఈ క్రమంలో తన భర్త దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, తాను ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది. తనను సుఖపెట్టే సరైన వ్యక్తి కోసం చూస్తున్నానని రెచ్చగొట్టింది.
ఇష్టమైతే తన చెప్పిన చోటుకు వస్తే ఇద్దరూ సంతోషంగా గడపొచ్చని చిరునామా లొకేషన్‌ను పంపించింది. తనంతట తానుగా ఆమె రమ్మని చెప్పడంతో యువ పారిశ్రామికవేత్త ఆశగా అక్కడకు వెళ్లాడు. ఇద్దరూ ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు యువకులు ప్రత్యక్షమయ్యారు. దీంతో షాకైన అతడు.. వలపు వలలో చిక్కుకున్నానని తెలుసుకున్నాడు. యువకుడిపై దాడిచేసిన ఆ ముగ్గురూ.. ఇక్కడకు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. తాము చెప్పినట్టు వినకపోతే అర్ధనగ్నంగా రోడ్డుమీద పరుగెత్తిస్తామని, సున్తీ చేయించుకోవాలని, ఆమెను వివాహం చేసుకోవాలని బెదిరించారు.

తమ మాట వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. పరువు పోకుండా ఉండాలంటే తమకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తన వద్ద రూ.21 వేలు వారికి ట్రాన్స్‌ఫర్ చేసిన యువకుడు. అతడ్ని రాత్రి 8 గంటల వరకూ అక్కడ బంధించారు. తర్వాత క్రెడిట్ కార్డు తీసుకురావాలని చెప్పడంతో ఇదే సరైన అవకాశంగా భావించి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టి అరెస్ట్ చేశారు.

కొద్ది రోజుల కిందట ఇద్దరు మహిళలు సహా కరుడగట్టిన హనీట్రాప్ ముఠాను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఓ యువకుడికి నగ్న ఫోటోలను పంపి ట్రాప్ చేసిన ముఠా.. బెగార్‌లోని ఓ గదికి రప్పించారు. అక్కడ అతడ్ని అర్ధనగ్నంగా నిలబెట్టి వీడియో తీసి దాని ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.