యాప్నగరం

కావేరీ లేకపోతే బెంగళూరు పరిస్థితేంటి?

భారత దేశపు ఉద్యాన నగరిగా ప్రసిద్ధి గాంచిన బెంగళూరు ప్రాణ వాయువు కావేరీ అంటే నమ్మశక్యం కాదు. గత అయిదు దశాబ్దాలుగా కావేరీ జలాల వాడకం అధిమవుతోంది.

TNN 18 Oct 2016, 8:30 pm
బెంగళూరులోని సుమారు 60 శాతం జనాభా కావేరీ జలాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 1964 నుంచి బెంగళూరు నీటి అవసరాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గత 52 ఏళ్ల నుంచి కావేరీ జలాల వాడకం ఏటా పెరుగుతూ వస్తోంది. ఒక్క బెంగళూరుకే ఇది పరిమితం కాలేదు, మైసూరు, మాండ్యతోపాటు 48 పట్టణాలు, 600 గ్రామాలు కావేరీ జలాలపై ఆధారపడి ఉన్నాయని స్వయానా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు కావేరీ నీటిని విడుదల చేయలేమని ఆయన తేల్చేశారు. కొడగులో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కావేరీతోనే రైతుల జీవితాలు పెనవేసుకున్నాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. అంతే కాకుండా బ్రిటిష్ కాలం నుంచి కూడా దేశంలోనే అత్యధికంగా నీటిని వినియోగించే నది కేవలం కావేరీ మాత్రమే అని ఆయన అన్నారు. 1875-76 గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగంలో సుమారు 81 శాతం కావేరీ నీటిని వినియోగించినట్లు తెలుస్తుందని అన్నారు. కర్ణాటకలో కావేరీ పరివాహక ప్రాంతం 34,273 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంతే కాకుండా ఈ ప్రాంతాల్లోని రైతులు చెరకు, వరి పండిస్తారు, వీటికి నీటి వినియోగం కూడా ఎక్కువే.
Samayam Telugu bengaluru depends upon cauvery river water 60 percent people survived
కావేరీ లేకపోతే బెంగళూరు పరిస్థితేంటి?

గత దశాబ్ద కాలంలో కావేరీ పరివాహక ప్రాంతంలో జనాభా 5.8 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ పరిశోధకుడు టీవీ రామచంద్ర జరిపిన అధ్యయనంలో వెలుగు చూసింది. గడిచిన నాలుగు దశాబ్దాల్లో బెంగళూరు జనాభా 47 శాతం పెరిగింది, అలాగే నగరంలో 80 శాతం నీటి వనరులు అంతరించిపోయాయి. ఏడాది పొడుగునా 23.10 టీఎంసీల కావేరీ జలాలను బెంగళూరుకు తరలిస్తున్నారని బెంగళూరు వాటర్ సప్లయ్ అండ్ సేవరేజ్ బోర్డు మాజీ చీఫ్ ఇంజినీర్ ఎస్ .కృష్ణప్ప తెలిపారు. నగరంలో రోజుకు 2000 మిలియన్ లీటర్ల డిమాండ్ ఉంటే కేవలం 1700 మిలియన్ లీటర్ల మాత్రమే బీడబ్ల్యూఎస్ఎస్బీ సరఫరా చేస్తుంది. రోజుకు సగటున 200 నుంచి 400 కుటుంబాలు ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు వలస వస్తున్నారు. వీరిందరికీ తాగునీటి సదుపాయాల కల్పన కష్టంగా మారుతుంది. వీటిని అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వం మేకేదాతు ప్రాంతంలో కావేరీ నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నిస్తోంది. అయితే తమిళనాడు దీన్ని వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కావేరీ జన్మస్థానమైన కొడుగులో భూగర్భ జలాలతోపాటు అల్పవర్షపాతం కారణంగా నదిలో నీటి నిల్వలు తగ్గిపోయాయి.... పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని సేవ్ కావేరీ ఫౌండేషన్ కార్యకర్త రిటైర్డ్ కల్నల్ ముతాన్నా అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.