యాప్నగరం

భర్త సంపాదన గంటకి రూ.5 వేలు.. తెలిసి తట్టుకోలేకపోయిన భార్య.. విడాకులు

బీపీలో పనిచేస్తున్న ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. ఇంతలో ఆయన ఉద్యోగం పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. గంటకి రూ.5 వేలు సంపాదిస్తున్నాడని తెలిసి భార్య భరించలేకపోయింది.

Samayam Telugu 12 Apr 2021, 6:31 pm

ప్రధానాంశాలు:

  • తొలిచూపులోనే ప్రేమించుకున్న జంట
  • రెండేళ్ల తర్వాత వివాహం
  • భర్త బాగోతం తెలిసి విడాకులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sad woman
కరోనా కారణంగా భర్త ఉద్యోగం పోయింది. నెలల తరబడి ఖాళీగా ఉన్న ఆయన.. ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. ఎప్పుడూ ఫోన్, ల్యాప్‌టాప్‌కే పరిమితమైపోతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్లొస్తున్నాడు. భర్త ప్రవర్తనలో తేడా గమనించిన భార్య అతనిపై నిఘా పెట్టింది. ల్యాప్‌టాప్‌లో సీక్రెట్ ఫోల్డర్ ఓపెన్ చేయించడంతో భర్త బండారం బయటపడింది. గంటకి ఐదు వేలు సంపాదిస్తున్న భర్తకి విడాకులిచ్చిందుకు సిద్ధమైంది. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.
బెంగళూరులోని ఓ బీపీవోలో పనిచేసే భవేష్(27) శ్రుతి(24) (పేర్లు మార్చాం) తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు. బీపీవో క్యాంటీన్‌లో చూసుకుని ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండేళ్లు ప్రేమించుకున్న తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2019లో పెళ్లి చేసుకుని నగరంలోని సుబ్రమణ్యనగర్‌లో కాపురం పెట్టారు. ఇంతలో కరోనా లాక్‌డౌన్ రావడంతో కష్టాలు మొదలయ్యాయి. భర్త ఉద్యోగం ఊడింది.

ఉద్యోగం కోసం భవేష్‌ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కొద్ది నెలలు గడిచిన తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు రావడం గమనించింది శ్రుతి. ఎప్పుడూ ల్యాప్‌టాప్, ఫోన్‌కి అతుక్కుపోయి ఉంటున్నాడు. వేళ కాని వేళల్లో పని ఉందంటూ బయటికి వెళ్లి వస్తున్నాడు. అతని ల్యాప్‌టాప్‌లో ఓ సీక్రెట్ ఫోల్డర్ పెట్టుకున్నాడు. అది గమనించిన శ్రుతి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన తన సోదరుడి సాయంతో సీక్రెట్ ఫోల్డర్‌ని ఓపెన్ చేయించడంతో భర్త అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఫోల్డర్‌లో భర్త న్యూడ్ ఫొటోలతో పాటు అమ్మాయిలు, ఆంటీల సెల్ఫీలు, అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు చూసి బిత్తరపోయింది. ఆరా తీస్తే దిమ్మతిరిగిపోయే విషయం తెలిసింది. తన భర్త మగ వ్యభిచారిగా మారాడని తెలిసి కంగుతింది. గంటకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ డబ్బులు తీసుకుంటాడని తెలిసింది. భర్త వ్యవహారంతో కంపరమెత్తిపోయిన భార్య పోలీసులను ఆశ్రయించింది. పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించినా ఇద్దరూ విడిపోయేందుకే మొగ్గుచూపారు. విడాకులు తీసుకోనున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.