యాప్నగరం

భారత్ బంద్: బ్యాంకులు పనిచేస్తాయా?

Farmers Protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగులు కూడా ఆందోళనలో పాల్గొంటారా? బ్యాంకులు పనిచేస్తాయా? అనే సందేహాలు తలెత్తాయి.

Samayam Telugu 8 Dec 2020, 1:01 am
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. మంగళవారం (డిసెంబర్ 8) ‘భారత్‌ బంద్’కు పిలుపునిచ్చారు. భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా 24 పార్టీలు మద్దతు ప్రకటించాయి. అన్ని వర్గాల నుంచి రైతులకు మద్దతు లభిస్తోంది. పలు కార్మిక, ఉద్యోగ సంఘాలు కూడా రైతులకు సంఘీభావం ప్రకటించాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Bankers support Bharat Bundh


బ్యాంకు ఉద్యోగ సంఘాలు కూడా రైతులకు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్ బంద్ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు కూడా పాల్గొంటారా? బ్యాంకులు పనిచేస్తాయా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై ఆ సంఘాలు వివరణ ఇచ్చాయి.

రైతులకు తాము కేవలం సంఘీభావం మాత్రమే ప్రకటించామని.. భారత్ బంద్‌లో పాల్గొనడం లేదని బ్యాంకు ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. రైతులకు మద్దతుగా పని గంటల ముందు, తర్వాత నిరసన వ్యక్తం చేస్తామని వివరణ ఇచ్చారు. నల్లరంగు బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని తెలిపారు.

‘రైతులు చేపట్టిన భారత్‌ బంద్‌కు మా ఉద్యోగ సంఘం మద్దతు ఇస్తోంది’ అని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ) జనరల్‌ సెక్రెటరీ సౌమ్య దత్తా తెలిపారు. తాము ధర్నాలు చేపట్టడం లేదని, బంద్‌లో పాల్గొనడం లేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తిస్తామని తెలిపారు.

Also Read: వ్యవసాయ చట్టాల్లో ఏముంది? రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.