యాప్నగరం

యూపీలో భాజపాదే అధికారం: అమిత్ షా

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడింట రెండింతల మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

TNN 28 Jan 2017, 6:35 pm
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడింట రెండింతల మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. యూపీ ఎన్నికల మ్యానిఫేస్టో ఈ రోజు విడుదల చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీలో తమపార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. 30 లక్షల మంది ప్రజల నుంచి ఫోన్, లేఖల ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని షా పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పించి, రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని అన్నారు.
Samayam Telugu bharatiaya janata party released up elections manifesto
యూపీలో భాజపాదే అధికారం: అమిత్ షా


వ్యవసాయ రుణాలతోపాటు విద్యార్థులకు ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు గత పదిహేనేళ్లుగా యూపీని దోచుకున్నాయని, మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపుతామని షా అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు కేంద్రం రూ.లక్ష కోట్లు నిధులు మంజూరు చేసినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, శాంతిభద్రతలు మరీ తీసుకట్టుగా మారాయని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.