యాప్నగరం

హాస్టల్ హర్రర్: బలవంతంగా పోర్న్ వీడియోలు చూపించి, అసహజ సెక్స్

భోపాల్‌లో వికలాంగుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లో యువతులపై నిర్వాహకుడే అకృత్యాలకు పాల్పడటం విస్మయానికి గురి చేస్తోంది.

Samayam Telugu 12 Aug 2018, 12:35 pm
బిహార్లోని ముజఫర్‌పూర్‌‌లోని ఓ వసతి గృహంలో 34 మంది బాలికలపై అత్యాచార ఉదంతం మరువక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. భోపాల్‌లో వికలాంగుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లో యువతులపై నిర్వాహకుడే అకృత్యాలకు పాల్పడటం విస్మయానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. 36 ఏళ్ల అశ్విన్ శర్మ తన ఎన్జీవో ద్వారా భోపాల్‌‌లో రెండు హాస్టళ్లను నిర్వహిస్తున్నాడు. వీటికి సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక సాయం చేస్తోంది.
Samayam Telugu rape on minor


అద్దె ఇంట్లో వికలాంగ యువతుల కోసం హాస్టల్ నడుపుతున్న శర్మ.. తనను రేప్ చేశాడని బధిర యువతి ఆరోపించింది. శర్మ తమను కూడా రేప్ చేశాడని ఇప్పటి వరకూ నలుగురు యువతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఫోర్న్ వీడియోలు చూడాలని శర్మ తనను బలవంతం చేశాడని, తనతో అసహజ శృంగారం జరిపాడని, ఒప్పుకోనందుకు.. పాశవికంగా వ్యవహరించాడని ఓ బాధితురాలు వాపోయింది. ఇతర అమ్మాయిలనూ అతడు హింసించడం తాను చూశానని, భయంతో ఇప్పటి వరకూ నోరు మెదపలేదని తెలిపింది.

అశ్విన్ శర్మపై భోపాల్, ఇండోర్‌లలో కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 19 ఏళ్ల యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నానని చెప్పిన శర్మ.. మిగతా యువతులను తాను హింసించలేదని చెప్పాడు. 2017 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో హాస్టల్ నుంచి వెళ్లే వరకూ శర్మ తనపై అత్యాచార పర్వం కొనసాగించాడని ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గత మూడేళ్లలో ఈ హాస్టల్లో ఉన్న 21 మంది యువతుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హాస్టల్ కోసం ఇంటిని అద్దెకు ఇచ్చిన వారికి కూడా నోటీసులు పంపారు. శర్మ ఫోన్‌ను ఫోరెన్సిక్ నివేదికకు పంపిన పోలీసులు.. అతడు నడుపుతున్న హాస్టళ్లను ఖాళీ చేయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.