యాప్నగరం

మైసూరు పర్యాటకుల కోసం అద్దె సైకిళ్లు!

కర్ణాటకలోని మైసూరులో త్వరలో పర్యాటకుల కోసం సైకిళ్లను అద్దెకిచ్చే సేవలు ప్రవేశపెట్టనున్నారు.

TNN 8 Mar 2017, 5:46 pm
కర్ణాటకలోని మైసూరులో త్వరలో పర్యాటకుల కోసం సైకిళ్లను అద్దెకిచ్చే సేవలు ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వీటిని ప్రారంభించనున్నారు. మైసూరు నగరంలో మొత్తం 450 సైకిళ్లను అద్దెకిచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి రోషన్ బేగ్ చెప్పారు.
Samayam Telugu bicycle for rent in mysuru for tourists
మైసూరు పర్యాటకుల కోసం అద్దె సైకిళ్లు!


ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.20.52 కోట్ల వరకూ ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సైకిల్ స్టాండ్ల కోసం 48 ప్రాంతాలను గుర్తించారు. తక్కువ రెంటుకే సైకిళ్లను అద్దెకివ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తింపు కార్డుల ద్వారా వీటిని అద్దె రూపంలో అందిస్తారు. సులభమైన చెల్లింపు పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.