యాప్నగరం

వీడియో: బాబోయ్.. ఇంట్లో 23 పాములు బుస్ బుస్!

Bihar: ఇంట్లో ఒకేసారి 23 పాములు బుసలు కొడితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది. బీహార్‌లో ఓ కుటుంబానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

Samayam Telugu 12 Jul 2020, 11:21 pm
మీపంగా పాము కనబడిదంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఆ పాము కాస్త ఇంట్లోకి వచ్చి తిష్ట వేసిందంటే.. ఇక దాన్ని వెతికి బయటకి తరమేదాకా ఇంట్లో అడుగు పెట్టాలంటేనే వణుకు. మరి ఇంట్లో ఒకేసారి 23 పాములు బుస్ బుస్ అంటే.. ఇక ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ కుటుంబానికి ఇదే పరిస్థితి తలెత్తింది.
Samayam Telugu ఇంట్లో 22 పిల్లల్ని పెట్టిన పాము
Snake and 22 snakelets in Bihar House


విషసర్పం ఇంట్లోకి ఎప్పుడు ప్రవేశించిందో తెలియదు గానీ.. మొత్తం 22 పిల్లల్ని పెట్టింది. తల్లి సహా 23 పాములు బుస్ బుస్ అంటుంటే.. ఆ శబ్దాలకు కుటుంబసభ్యులు హడలిపోయారు. వెంటనే ఇంటికి తాళం పెట్టి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ రెస్క్యూ టీమ్‌తో కలిసి వచ్చిన మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆ పాములన్నింటినీ పట్టి సంచిలో వేసుకొని తీసుకెళ్లిపోయారు. దూరంగా అడవిలో వదిలిపెట్టారు.

అదృష్టవశాత్తూ ఆ కుటుంబంలో ఏ ఒక్కరికీ ఆ సర్పాల వల్ల ప్రమాదం జరగకపోవడం ఊరట కలిగించే అంశం. ఆ పాములన్నింటినీ మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లిపోవడంతో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అయినా.. భయంభయంగానే ఉందని చెబుతున్నారు.

Also Read: బిగ్ రిలీఫ్: రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. అందరి కంటే ముందే!

Must Read: కరోనా వార్డులో ‘మందు’ తీసుకుంటున్న రోగి.. వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.