యాప్నగరం

బిహార్: నాగపంచమి రోజున వందల సర్పాలతో ఊరేగింపు.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన

నాగ పంచమి రోజున వందలాది సర్పాలతో రోడ్లమీదకు వచ్చిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పంచమి రోజున సర్పాలతో ఊరేగింపులో పాల్గనే ఆచారం అక్కడ నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది.

Samayam Telugu 30 Jul 2021, 12:18 pm
ఉత్తరాదిలో సూర్యమానం అనుసరించి పంచాంగాన్ని లెక్కిస్తారు. సూర్యమానం ప్రకారం.. హిందూ నెలలు పౌర్ణమితో ప్రారంభమవుతాయి. దీంతో శ్రావణమాసం కృష్ణపక్ష పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో బిహార్‌లో నాగపంచమి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. బెగుసరాయ్‌ జిల్లాలోని అగార్‌పూర్‌ గ్రామ పూజారులు మడుగు నుంచి వందలాది పాములను బయటకు తీసి.. వాటిని మెడలో వేసుకుని విన్యాసాలు చేశారు. అగార్‌పూర్‌ గ్రామంలో భగవతీస్థాన్‌ అనే మందిరాన్ని 40 ఏళ్ల కిందట 1981లో ఏర్పాటు చేశారు.
Samayam Telugu bihar people celebrates with snakes during nag panchami
బిహార్: నాగపంచమి రోజున వందల సర్పాలతో ఊరేగింపు.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన


అప్పటి నుంచి గ్రామానికి ఎలాంటి సమస్యలు రాలేదని స్థానికులు పేర్కొన్నారు. పాములను పట్టుకునే సంప్రదాయాన్ని గ్రామభగత్‌ అని పిలిచే పూజారులు ప్రారంభించారని తెలిపారు. అటు, సంస్థీపూర్‌ జిల్లాలోని విభూతీ పూర్‌లో వందలాది పాములను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో యువకులు సర్పాలను పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పాములను ఊరేగించడం, వాటితో విన్యాసాలు చేయడం వల్ల తమకు మంచి జరగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

భవిష్య పురాణం ప్రకారం.. కృష్ణపక్షంలోని అష్టమి, నవమి, చతుర్దశి నాడు విషసర్పాలు కాటువేస్తే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. నాగపంచమి రోజున సర్పాలను పూజించేవారికి వాటి ముప్పు ఉండదని నమ్మకం.

శ్రావణమాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను కొలుచుకుంటారు. శ్రీకృష్ణుడు కాళియమర్దనం చేసింది ఈ రోజేనని చెబుతారు. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకి బదులుగా... ఈ రోజు తమని పూజించాలంటూ ఆదిశేషుడు, విష్ణుమూర్తిని కోరుకున్నాడని, ఈ నాగపంచమి మహిమని సాక్షాత్తు ఆ శివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. నాగపంచమిని ఎలా జరుపుకోవాలో కూడా శాస్త్రాలు సూచిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.