యాప్నగరం

వీడియో: శానిటైజర్‌తో జాగ్రత్త.. ఘోర ప్రమాదం తప్పింది!

బైక్ సీటు కవర్లో శానిటైజర్ పెట్టడం వల్ల ఓ పెట్రోల్ బంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samayam Telugu 31 Jul 2020, 1:52 pm
రోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ శానిటైజర్ ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా మారింది. శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటే వైరస్ దరి చేరదు. అయితే.. తేడా వస్తే ఈ శానిటైజర్ శరీరాన్ని కాల్చేయగలదు. శానిటైజర్‌లో వినియోగించే ద్రావణం ప్రమాదకరమైంది. ఇది తేలిగ్గా మంటలు అంటుకోవడానికి కారణమవుతుంది.
Samayam Telugu శానిటైజర్‌తో ప్రమాదం
Bike fire accidne in Gujarat


ఓ వ్యక్తి తన బైక్ టాప్ కవర్‌లో శానిటైజర్ పెట్టుకొని ఇంధనం నింపుకో వడానికి పెట్రోల్ పంప్ వద్దకు వచ్చాడు. వాహనంలో పెట్రోల్ పొస్తుండగా.. బంకులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి వాళ్లు తృటిలో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read: ఆస్ప్రత్రిలో చేరిన సోనియా గాంధీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.