యాప్నగరం

సోనియాజీ, అభ్యర్థి ఎవరో మీరే చెప్పండి: బీజేపీ

రాష్ట్రపతి ఎన్నికలో అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు కాంగ్రెస్

Samayam Telugu 18 Jun 2017, 12:36 pm
రాష్ట్రపతి ఎన్నికలో అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై చర్చించారు. తాము నిలబెట్టే అభ్యర్థి ఎన్నికపై ఏకాభిప్రాయం సాధించేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. అభ్యర్థి ఎవరో చెప్పకుండా సోనియాగాంధీతో నేతలు చర్చించడం విశేషం. ఈ సమావేశం దాదాపు అర్థగంటపాటు జరిగింది.
Samayam Telugu bjp asks sonia gandhi to suggest a name for presidential candidate
సోనియాజీ, అభ్యర్థి ఎవరో మీరే చెప్పండి: బీజేపీ


అయితే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో మీరే చెప్పండి అంటూ సోనియాగాంధీ వద్ద బీజేపీ నేతలు ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. అభ్యర్థి ఎవరో తేలకుండా మద్దతు అడిగితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

‘ఎప్పుడైతే వారు అభ్యర్థి పేరు వెల్లడించలేదో.. ఏకాభిప్రాయం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని మరో నేత మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 20-21 తేదీల్లో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో రాష్ట్రపతి అభ్యర్థిపై సోనియా చర్చించనున్నారు.

మరోవైపు ప్రముఖ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ పేరును ప్రతిపాదించాలని శివసేన భావిస్తోంది.
అభ్యర్థి ఏకగ్రీవం కాకపోతే జులై 17న రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగుతుంది. జులై 20న ఫలితాలు వెలువడుతాయి. జులై 25న రాష్ట్రపతి పదవీకాలం ముగియనుండగా, ఉపరాష్ట్రపతి అమిద్ హన్సారీ పదవీకాలం ఆగస్టులో ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.