యాప్నగరం

బీజేపీ-కాంగ్రెస్ డిష్యూం, డిష్యూం

ఆదివారం శ్రీనగర్, మధ్యప్రదేశ్ లలో జరిగిన ఉప ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలీసులపైకి

TNN 9 Apr 2017, 7:05 pm
ఆదివారం శ్రీనగర్, మధ్యప్రదేశ్ లలో జరిగిన ఉప ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ పోలింగ్ బూత్ లలో చొరబడేందుకు ప్రయత్నించిన యువకులపై శ్రీనగర్ భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు యువకులు మృతిచెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
Samayam Telugu bjp cong clash in madhya pradesh at by poll stations
బీజేపీ-కాంగ్రెస్ డిష్యూం, డిష్యూం


ఇదిలా ఉండగా, ఉదయం నుంచే ఉప ఎన్నికలు జరుగుతున్న ఏరియాలో హింస చెలరేగడంతో ప్రజలు ఓట్లు వేయడానికి ముందుకు రాలేదు.

ఇటు మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ బూత్ లలో బీజేపీ కార్యకర్తలు ఇష్టానుసారంగా చేరారని...దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.

అతేర్, బందవ్ ఘర్ అసెంబ్లీలకు ఇవాళ ఉప ఎన్నికలు జరిగాయి.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలింగ్ ను ప్రభావితం చేశారని కాంగ్రెస్ ఆరోపించగా... కాంగ్రెస్ ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించందంటూ బీజేపీ ఆరోపించింది.

ఈ నియోజకవర్గాలు ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 13న జరుగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.