యాప్నగరం

కశ్మీర్: సంకీర్ణ సర్కారుకి మద్దతు ఉపసంహరించిన బీజేపీ, రాష్ట్రపతి పాలన?

కశ్మీరీల సమస్యలను పరిష్కరించడంలో మెహబూబా ముఫ్తీ సర్కారు విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు బీజేపీ తెలిపింది.

Samayam Telugu 19 Jun 2018, 2:40 pm
కశ్మీర్లో నానాటికీ హింస పెరిగిపోతుండటం, పీడీపీతో దూరం పెరుగుతుండటంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్లోని సంకీర్ణ సర్కారుకు మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించింది. ఢిల్లీలో జమ్మూ కశ్మీర్‌కి చెందిన బీజేపీ మంత్రులు, పార్టీ నేతలతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొగాలని నిర్ణయించారు. బీజేపీ నిర్ణయంతో మూడేళ్ల ముఫ్తీ సర్కారు కుప్పకూలి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.
Samayam Telugu modi mufti


‘కశ్మీర్ లోయలో హింస, ఉగ్రవాదం పెరుగుతోంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. శ్రీనగర్లో పత్రిక ఎడిటర్‌ను హత్య చేశారు. కేంద్రం కశ్మీర్లో అనేక ప్రాజెక్టులను అమలు చేసింది. రూ.80 వేల కోట్లను అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించింది. ఇటీవలే ప్రాజెక్టుల విషయమై ప్రధాని లడఖ్‌లో పర్యటించారు. భద్రత కోసం కేంద్రం హోం శాఖ రాష్ట్రానికి పూర్తి అండగా ఉంటోంది. పీడీపీ మూడేళ్ల పాలనలో జమ్మూ, లడఖ్ ప్రాంతాల ప్రజలు వివక్షకు గురువుతున్నట్టు భావిస్తున్నారు. కశ్మీరీల సమస్యలను పరిష్కరించడంలో మెహబూబా సర్కారు విఫలమైంద’ని బీజేపీ నేత రామ్ మాధవ్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.