యాప్నగరం

అరుణాచల్‌లో బీజేపీ ప్రభుత్వం!

అనేక రాజకీయ పరిణామాల మధ్య అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ తొలిసారి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

TNN 31 Dec 2016, 7:52 pm
అనేక రాజకీయ పరిణామాల మధ్య అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ తొలిసారి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి పెమా ఖండును పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) గురువారం బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం బీజేపీ పెమాకు పూర్తి మద్దతు ప్రకటించింది. దీంతో ఖండూ సహా ఆయన నాయకత్వంలోని 32 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరి పీపీఏకు షాక్ ఇచ్చారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజీపీ సంఖ్యా బలం గణనీయంగా పెరిగింది. దీంతో ఖండూ సీఎంగా బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Samayam Telugu bjp forms new government in arunachal pradesh after pema khandu 32 other mlas join it
అరుణాచల్‌లో బీజేపీ ప్రభుత్వం!


నిజానికి పీపీఏ ఖండూతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో సీఎం ఖండూపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షులు కఫా బెంగియా వెల్లడించారు. అంతేకాకుండా కొత్త సీఎంగా తకమ్ పరియో పేరును కూడా ప్రకటించారు. అయితే పీపీఏకు ఊహించని దెబ్బ తగిలింది. తనతో పాటు మరో 32 మంది ఎమ్మెల్యేలను ఖండూ తీసుకుపోయి బీజేపీలో చేరడంతో పీపీఏ తల పట్టుకుంది.

సీఎం ఖండూ సహా 33 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు అరుణాచల్ బీజేపీ అధ్యక్షుడు తపిర్ గోవా ఖరారు చేసారు. పెమా ఖండూనే సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేసారు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా బీజేపీ పూర్తి స్థాయి, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.