యాప్నగరం

రాజ్యసభలో ఏకాకిగా మారిన బీజేపీ...

ఏపీ విభజన హామీల అమలుపై చర్చ సందర్భంలో బీజేపీ ఇరుకున పడింది.

TNN 28 Jul 2016, 9:56 pm
ఏపీ విభజన హామీల అమలుపై చర్చ సందర్భంలో బీజేపీ ఇరుకున పడింది. పార్టీలకు అతీతంగా విపక్ష సభ్యులందరూ ఏకమై బీజేపీపై ఎదురు దాడి చేశారు. ప్రత్యేక హోదాకు మద్దుత తెలుపుతూ ఎస్పీ, జేడీయూలతో సహా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ , సీపీఎం సభ్యులు బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో బీజేపీ ఏకాకిగా మారినట్లయింది. మిత్రం పక్షంగా భావిస్తున్న సీఎం రమేష్ మొదట్లో వెంకయ్యను సమర్థిస్తున్నాట్లు కనిపించినప్పటికీ హామీలు అమలు చేయాల్సేందనని గట్టిగా పట్టుబట్టారు. అలాగే విపక్ష సభ్యులు స్పందిస్తూ విభజన సమయంలో వెంక్యయ్య చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కోరిన వెంకయ్య దీనిపై ఎందుకు మౌనంగా ఉండిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu bjp had been isolated in the rs
రాజ్యసభలో ఏకాకిగా మారిన బీజేపీ...


ప్రధాని మోడీ ఒత్తిడి వల్లే ఆయన వెనక్కితగ్గారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట నిలుపుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యనానికి, ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు..ఇలా ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుుతున్న సమయంలో అధికార పార్టీ సభ్యులు మౌనం వహించడం తప్పా ఏపీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సందర్భంగా డిప్యూటీ ఛైర్మన్ మాట్లాడుతూ ఆగస్ట 5వ తేదీనా బిల్లుపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతాయని.. ఇందులో ఎవ్వరికీ సందేహం అవసరంలేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.