యాప్నగరం

BJP Leader on Flag: జాతీయ జెండా లేని ఇళ్లను ఫోటో తీయాలి.. వారికి దేశభక్తి లేనట్టే: బీజేపీ నేత

జాతీయ జెండా (BJP Leader on Flag) విషయంలో ఓ బీజేపీ నేత మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. అయితే తాను అలా అనలేదని వివరణ ఇచ్చారు. తాను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్ బీజేపీ నాయకుడు మహేంద్ర భట్ ఇళ్లలో జెండాను పెట్టుకోని ఫోటోలు తనకు పంపించాలని, అలాంటి వారికి దేశభక్తి లేనట్టేనని అన్నారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై విమర్శలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను ఆ ఉద్దేశంతో అనలేదన్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 12 Aug 2022, 7:45 pm

ప్రధానాంశాలు:

  • ఉత్తరాఖండ్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
  • సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • తాను అలా అనలేదన్న మహేంద్ర భట్ వివరణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mahendra Bhatt
BJP Leader on Flag: స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రతి ఇంట జెండా ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అయితే దీనిపై ఓ బీజేపీ నాయకుడు అనుచితంగా మాట్లాడారు. త్రివర్ణ పతాకాలను ఎగురవేయని ఇళ్లను ఫోటో తీయాలంటూ ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ డిమాండ్ చేశారు. అయితే సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను అనలేదన్నారు.
తను ఫోటోలు తీయమన్నది బీజేపీ కార్యకర్తల ఇళ్లకు మాత్రమేనని, ప్రజలకు సంబంధించి కాదని మహేంద్ర భట్ అన్నారు. "ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించాలని నేను కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు. అయితే అంతకుముందు ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో మహేంద్రభట్ ఇళ్లపై జాతీయ జెండాను పెట్టుకోని వారిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. అలాంటి ఇళ్లను ఫోటో తీసి తనకు పంపించాలని కూడా పార్టీ కార్యకర్తలతో అన్నారు. అంతేకాదు ఇంటిపై జెండా ఉంచితేనే దేశభక్తి ఉన్నట్టుగా.. లేకపోతే దేశంపై నమ్మకం లేనివారని కూడా అన్నారు. "త్రివర్ణ పతాకం పెట్టని ఇంటిని మనం నమ్మలేం. నాకు అలాంటి ఇళ్ల ఫోటోలు కావాలి. సమాజం అలాంటి ఇళ్లను, అలాంటి కుటుంబాలను చూడాలి." అని అన్నారు.

దాంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ జెండా ర్యాలీ కార్యక్రమంలో మహేంద్ర భట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎవరిని అవమానించడం, అనుమానించడం తన ఉద్దేశం కాదన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడంలో ఎవరికైనా ఏ ఇబ్బంది ఉంటుందన్నారు. "ఈ దేశం పట్ల భావమున్న వారెవరైనా తమ ఇంట్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు వెనుకాడరని నా దృఢ విశ్వాసం." అని మహేంద్ర భట్ అన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాజకీయం చేస్తోందని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.