యాప్నగరం

అర్లీ ట్రెండ్స్: ముందంజ బీజేపీదే

అర్లీ ట్రెండ్స్ ను పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ముందజలో కనిపిస్తోంది. అయితే.. ఎస్పీ సమాజ్ వాదీ పార్టీల కూటమి మరీ వెనుకబడలేదు

TNN 11 Mar 2017, 8:45 am
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎక్కువ ఆసక్తిని రేపుతున్నది యూపీ ఫలితాలే. వీటి ఫలితాలపై జాతి యావత్తూ అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తోంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతుగా నిలిచిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏకంగా 90 శాతం ఎంపీ సీట్లను సొంతం చేసుకుని ఇక్కడ సంచలన విజయం సాధించింది బీజేపీ.
Samayam Telugu bjp leads in early trends
అర్లీ ట్రెండ్స్: ముందంజ బీజేపీదే


ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా హోరాహోరీన సాగాయి. కాంగ్రెస్ - సమాజ్ వాదీలు జతకట్టగా, బీజేపీ చిన్న పార్టీలతో కలిసి, బీఎస్పీ సొంతంగా బరిలోకి దిగింది.

ప్రీ పోల్ సర్వేలు కొన్ని బీజేపీకి పట్టం గట్టగా, ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ దే విజయం అన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి తొలి తొలి ఫలితాలు. అర్లీ ట్రెండ్స్ లో భారతీయ జనతా పార్టీ ముందు కనిపిస్తోంది. వంద స్థానాలకు సంబంధించి అర్లీ ట్రెండ్స్ ను పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ముందజలో కనిపిస్తోంది. అయితే.. ఎస్పీ సమాజ్ వాదీ పార్టీల కూటమి మరీ వెనుకబడలేదు.

ఆధిక్యం విషయంలో బీజేపీ కన్నా పది, పదిహేను సీట్లలో మాత్రమే వెనుక ఉంది ఈ కూటమి. ఇక బీఎస్పీ కూడా పలు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడో స్థానంలో కొనసాగుతోంది. ఎస్పీ కూటమి వెనుకే వస్తోంది. మరి బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ సంపాదించుకుంటుందా లేక యూపీ హంగ్ దిశగా ముందుకు వెళ్తుందా.. మరి కాసేపట్లో స్పష్టత వస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.