యాప్నగరం

మణిపూర్‌లో బలపరీక్ష నెగ్గిన బీజేపీ ప్రభుత్వం

మణిపూర్ అసెంబ్లీ్లో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నాంగ్‌తోంబమ్ బైరెన్ సింగ్ విజయం సాధించారు.

TNN 20 Mar 2017, 12:43 pm
మణిపూర్ అసెంబ్లీ్లో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నాంగ్‌తోంబమ్ బైరెన్ సింగ్ విజయం సాధించారు. 60 మంది సభ్యులతో కూడి శాసనసభలో 33 మంది సభ్యులు బైరెన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి ఓటేశారు. అలాగే బీజేపీకి చెందిన యుమ్నమ్ ఖేంచండ్ సింగ్‌ను శాసనసభ స్పీకర్‌గా ఎన్నుకున్నారు. అయితే మణిపూర్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఎన్. బైరెన్ సింగ్ మార్చి 16న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Samayam Telugu bjp led govt wins floor test in manipur cm biren singh gets support from 33 mlas
మణిపూర్‌లో బలపరీక్ష నెగ్గిన బీజేపీ ప్రభుత్వం


కాగా, బీజేపీ తన శాసనసభ్యులతోపాటు ఒక స్వతంత్ర సభ్యుడిని, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడిని గురువారం నుంచి గౌహతిలోని ఓ హోటల్ ఉంచారు. అయితే మంత్రివర్గంలో మాత్రం తమ మిత్రపక్షాలకు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యమంత్రితోపాటు మరో ఇద్దరు బీజేపీ సభ్యులు మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. నలుగురు ఎన్‌పీపీ సభ్యులు, ఎన్పీఎఫ్, ఎల్జేపీ నుంచి ఓక్కో సభ్యుడు, కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన ఒక సభ్యుడికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

ఎన్‌పీపీ, ఎన్పీఎఫ్, ఎల్జేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల సహాయంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 31 స్థానాల మెజారిటీ అవసరం. మరోవైపు 28 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.