యాప్నగరం

స్వైన్‌ ప్లూతో ఎమ్మెల్యే మృతి.. ప్రధాని సంతాపం

దేశంలో స్వైన్‌ ఫ్లూ భూతం తన కోరలు చాస్తూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి ఏకంగా ఓ ఎమ్మెల్యే మరణించారు. రాజస్థాన్‌లో కిల్వారా జిల్లా మంగలగఢ్‌ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కీర్తి కుమారి (50) స్వైన్ ‌ఫ్లూ కారణంగా..

TNN 29 Aug 2017, 4:47 pm
దేశంలో స్వైన్‌ ఫ్లూ భూతం తన కోరలు చాస్తూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి ఏకంగా ఓ ఎమ్మెల్యే మరణించారు. రాజస్థాన్‌లో కిల్వారా జిల్లా మంగలగఢ్‌ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కీర్తి కుమారి (50) స్వైన్ ‌ఫ్లూ కారణంగా సోమవారం (ఆగస్టు 28) ఉదయం మృతి చెందారు. అధికార బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయిన కీర్తి కుమారి వారం రోజుల కిందట సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు స్థానిక వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన చికిత్స తీసుకోవాలంటూ కీర్తి కుమారికి వైద్యులు, కుటుంబ సభ్యులు సూచించినా.. ఆమె నిర్లక్ష్యం చేశారు.
Samayam Telugu bjp mla kirti kumari from rajasthan dies of swine flu
స్వైన్‌ ప్లూతో ఎమ్మెల్యే మృతి.. ప్రధాని సంతాపం


శ్వాసక్రియలో తీవ్రమైన ఇబ్బందితో కీర్తి కుమారి ఆదివారం జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. బిజోలియా ప్రాంతంలో ఓ ఉన్నత కుటుంబానికి చెందిన కీర్తి కుమారి.. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె సంతాపం తెలిపారు.

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ దంపతులు కూడా ఇటీవల స్వైన్ ఫ్లూ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకూ దేశంలో మొత్తం 1094 మంది స్వైన్ ఫ్లూ కారణంగా మృత్యువాతపడ్డారు. ఒక్క ఆగస్టు నెలలోనే 342 మంది మరణించడం గమనార్హం. మహారాష్ట్రలో 437 మంది, గోవాలో 269 మంది, రాజస్థాన్‌లో 69 మంది మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.