యాప్నగరం

అసోం బీజేపీ ఎమ్మెల్యేపై నెటిజన్లు ఫైర్... అవమానించకండంటూ కామెంట్స్

అసోం బీజేపీ ఎమ్మెల్యే సీబీ మిశ్రాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే పని అంటూ కామెంట్లు పెడుతున్నారు. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ రెస్క్యూ వర్కర్ తన వీపుపై ఎత్తుకుని.. చీలమండల లోతులో ఉన్న నీటిలో కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న పడవలోకి తీసుకెళ్లారు. దానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పోలీసులను అవమానించకండంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 19 May 2022, 7:23 pm

ప్రధానాంశాలు:

  • విమర్శలపాలవుతున్న ఎమ్మెల్యే సీబీ మిశ్రా
  • వరద పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే
  • అసోంలో బీభత్సం సృష్టించిన వరదలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బీజేపీ ఎమ్మెల్యే
అసోంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే విమర్శలపాలవుతున్నారు. ఆయనపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అక్కడ వరదలు బీభత్సం సృష్టించడంతో బీజేపీ ఎమ్మెల్యే సీబీ మిశ్రా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. అక్కడ వరద పరిస్థితిని పరిశీలించారు. అక్కడ జరిగిన ఓ స సంఘటనకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది. దానిని చూసిన నెటిజన్లు ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేం పని అంటూ ఛీత్కరిస్తున్నారు.
ఒక చోట విప‌రీత‌మైన నీరు ఉండ‌టం ద్వారా ఆయ‌న‌కు దాట‌డం సాధ్య‌ప‌డ‌లేదు. దాంతో ఎమ్మెల్యేను రెస్క్యూ వర్కర్ తన వీపుపై ఎత్తుకుని.. చీలమండల లోతులో ఉన్న నీటిలో కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న పడవలోకి తీసుకెళ్లారు. ఈ వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. కనీసం మోకాల్లోతు నీరు కూడా లేదని, అయినా సరే రెస్క్యూ టీమ్ సభ్యుడి వీపుపై ఎక్కి పడవ వరకు వెళ్లడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఒకరైతే పోలీసుల బలగాలని అవమానించకండంటూ కామెంట్ పెట్టారు. మరొకరైతే "హ హ బీజేపీ మోడల్.. రెస్క్యూ వర్కర్‌కి తగినంత బలం ఉందా..? లేదా..? అని ఎమ్మెల్యే పరీక్షిస్తున్నారు." అని వ్యాఖ్యానించారు. కాగా అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఏకదాటిగా కురిసిన వర్షాలకు అక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దాంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. రహదారులు దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్‌లు విరిగిపోయాయి. ఇళ్లలో పెద్దఎత్తున నీరు చేరి.. ప్రజలు ఎటూ పోలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి.


ఇప్పటి వరకు అసోంలో తొమ్మిది మంది చనిపోయారు. ఆరు లక్షలకుపైగా ప్రభావితమయ్యారు. నిరాశ్రయులైన వారిని పోలీసులు, సహాయ సిబ్బంది పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలామంది ప్రభుత్వ భవనాల్లో తలదాచుకుంటున్నారు. చాలాచోట్ల రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో విమానాల ద్వారా అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అసోం ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం కూడా వెయ్యి కోట్లను మంజూరు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.