యాప్నగరం

రామ మందిరానికి గౌతం గంభీర్ భారీ విరాళం

Ram Temple: అయోధ్య రామ మందిర నిర్మాణానికి మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ భారీ విరాళం ఇచ్చారు. తమ కుటుంబం తరఫున కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Samayam Telugu 22 Jan 2021, 11:30 am
యోధ్య రామమందిరం నిర్మాణానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ భారీ విరాళం ఇచ్చారు. తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణానికి తాను, తన కుటుంబం తరఫున ఈ మొత్తం అందజేసినట్టు గంభీర్ గురువారం (జనవరి 21) పేర్కొన్నారు.
Samayam Telugu గౌతం గంభీర్
Gautam Gambhir


‘అయోధ్య నగరంలో అద్భుతమైన రామమందిర నిర్మాణం భారతీయులందరి కల. మందిర నిర్మాణంపై సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు తెరపడటంతో ఐక్యత, ప్రశాంతతకు మార్గం సుగమమైంది. రామ మందిర నిర్మాణానికి మా వంతుగా చిన్న సాయం అందజేశాం’ అని గంభీర్ అన్నారు.

రామమందిరం నిర్మాణం కోసం హిందూ సంఘాల సభ్యులు, బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇంటింటా తిరిగా రామ మందిర నిర్మాణం గురించి వివరించి విరాళాలు అడుగుతున్నారు. రూ.10, రూ.20 ఇలా ఎంత తోస్తే అంత ఇవ్వొచ్చని కోరుతున్నారు. పవిత్ర కార్యంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Also Read:

పీపీఈ కిట్‌ ఇలా వాడొచ్చా.. 13 కోట్ల సొత్తు చోరీ

కుప్పకూలినట్లు నటించిన ఉగ్రవాది, గుమిగూడిన జనం.. ఘోరం, 32 మంది మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.